సోషల్ మీడియాలో మహేష్ కు పెరిగిన ఫాలోయింగ్
విధాత:సోషల్ మీడియా వచ్చాక తారలకు,అభిమానులకు మధ్య దూరం చెరిగిపోయింది. హీరోహీరోయిన్లు.. తమ వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్‌డేట్స్‌ను సైతం సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో తమ అభిమాన తారలను లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. అందులో సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేశ్‌బాబు తాజాగా సోషల్ మీడియాలోనూ దూకుడు ప్రదర్శించాడు. గురువారం అతడిని ఫేస్‌బుక్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 15 […]

విధాత:సోషల్ మీడియా వచ్చాక తారలకు,అభిమానులకు మధ్య దూరం చెరిగిపోయింది. హీరోహీరోయిన్లు.. తమ వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్‌డేట్స్‌ను సైతం సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో తమ అభిమాన తారలను లక్షలాది మంది ఫాలో అవుతున్నారు. అందులో సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేశ్‌బాబు తాజాగా సోషల్ మీడియాలోనూ దూకుడు ప్రదర్శించాడు. గురువారం అతడిని ఫేస్‌బుక్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 15 మిలియన్లు దాటింది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు నెట్టింట సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో మహేశ్‌బాబు పేరు నెట్టింట మార్మోగిపోతోంది. మరో పక్క ఆయన యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కాగా మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సర్కారువారి పాట’ సినిమా గోవా షెడ్యూల్ ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో ముఖ్య సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీన్లను షూట్ చేశారు. ఇటీవలే మరో షెడ్యూల్ ప్రారంభం కాగా రేపటి నుంచి మహేశ్ సెట్స్‌లో జాయిన్ అవనున్నట్లు సమాచారం. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతోంది.