NTR- Prasanth Neel Movie | ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీలో రుక్మిణి వసంత్‌.. ట్రెండింగ్‌లోకి కన్నడ బ్యూటీ..!

NTR- Prasanth Neel Movie | జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన చిత్రం ‘దేవర’. పాటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటికే రూ.350కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ రూ.500కోట్ల కలెక్షన్‌ వైపు పరుగులు తీస్తున్నది. ఇక త్వరలో సలార్‌, కేజీఎఫ్‌ మూవీలతో సెస్సేషన్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ఓ మూవీని చేయనున్నాడు.

NTR- Prasanth Neel Movie | ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీలో రుక్మిణి వసంత్‌.. ట్రెండింగ్‌లోకి కన్నడ బ్యూటీ..!

NTR- Prasanth Neel Movie | జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన చిత్రం ‘దేవర’. పాటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటికే రూ.350కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ రూ.500కోట్ల కలెక్షన్‌ వైపు పరుగులు తీస్తున్నది. ఇక త్వరలో సలార్‌, కేజీఎఫ్‌ మూవీలతో సెస్సేషన్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ఓ మూవీని చేయనున్నాడు. త్వరలోనే మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీని తీసుకున్నారనే వార్త తెగ వెరల్‌ అవుతున్నది. ప్రశాంత్‌ నీల్‌ చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో భారీ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు పొందాడు. ప్రభాస్‌ సలార్‌ సైతం బంపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో మూవీని ప్లాన్‌ చేశాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణి వసంత్‌ను ఫైనల్‌ చేశారు.

ఇటీవల కాలంలో శాండల్‌వుడ్‌లో రుక్మిణి వసంత్‌ పేరు తెగ వినిపిస్తున్నది. సప్త సాగరదాచె ఎల్లో : సైడ్‌ ఏ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది. ఆ తర్వాత . సప్త సాగరదాచె ఎల్లో : సైడ్‌ బీలోనూ అద్భుతంగా నటించి ప్రశంసలు పొందింది. తెలుగులో ఈ మూవీ ‘సప్తసాగరాలు దాటి’ పేరుతో విడుదలైంది. మూవీ ఎలా ఉన్నా.. రుక్మిణి మాత్రం అభిమానుల్లో ఫాలోయింగ్‌ను సంపాదించింది. ఈ బ్యూటీ చివరిసారిగా కన్నడలో బానదరియాలి చిత్రంలో నటించింది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీకి ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ప్రస్తుతం కన్నడ, తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నది. కన్నడలో భగీర, భైరతి రనగల్‌.. తమిళంలో ఏస్‌తో పాటు శివకార్తికేయన్‌ మూవీతో నటిస్తున్నది. వాస్తవానికి రుక్మిణి తెలుగులో ఓ సినిమాలో నటించింది. నిఖిల్‌ హీరోగా నటించాడు. అయితే, పలు కారణాలతో ఆ సినిమా రిలీజ్‌ కాలేదు. ఇందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. తాజాగా రుక్మిణి.. జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీలో నటించే అవకాశం దక్కడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.