‘Kantara Chapter1’| కాంతార చాప్టర్-1’ విడుదల తేదీ ప్రకటన

విధాత : కాంతార చాప్టర్-1 సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు మేకర్స్ ప్రకటించారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో రానున్న ‘కాంతార చాప్టర్-1’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రిషబ్ పుట్టినరోజు సందర్భంగా కాంతారా చాప్టర్ 1 కొత్త పోస్టర్ ను షేర్ చేశారు. ఇతిహాసాలు పుట్టిన చోట గర్జనలు ప్రతిధ్వనిస్తాయని.. కాంతారాతో లక్షలాది మందిని కదిలించిన కళాఖండానికి ప్రీక్వెల్ గా ఇది రానుందని.. మార్గదర్శక శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని.. పురాణానికి నాంది.. హృదయాన్ని కదిలించే కథకు తిరిగి మరోసారి స్వాగతం అంటూ పోస్టర్ షేర్ చేసింది. పోస్టర్ లో హీరో రిషబ్ శెట్టి గొడ్డలితో యుద్ద వీరుడిగా కనిపిస్తున్నారు.
గతంలో 2022లో విడుదలై భారీ విజయం సాధించిన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార చాప్టర్ 1 పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రీక్వెల్ లో నటుడు జయరాం కీలక పాత్రలో కనిపించనున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంలపై విజయ్ కిరణ్ నిర్మిస్తున్న కాంతార చాప్టర్ 1 కోపం రిషబ్ శెట్టి కలరిపయట్టు యుద్దవిద్యలో శిక్షణ తీసుకుని మరి నటించారు. కాంతార సినిమాతో పంజుర్లి దేవుడు, భూతకోలం గురించి వెలుగులోకి వచ్చింది.