Kovai Sarala|ఏంటి.. కోవై స‌ర‌ళ ఇలా అయిపోయింది.. గుర్తు ప‌ట్ట‌కుండా మారిపోయింది..!

Kovai Sarala| కోవై స‌ర‌ళ‌.. ఈ పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న‌దైన కామెడీతో హాస్యాన్ని పంచి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఈమె 1979లో ఆర్.కృష్ణా డైరెక్షన్లో వచ్చిన’ వెళ్లి రత్నం‘ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుం

  • By: sn    cinema    Apr 29, 2024 12:42 PM IST
Kovai Sarala|ఏంటి.. కోవై స‌ర‌ళ ఇలా అయిపోయింది.. గుర్తు ప‌ట్ట‌కుండా మారిపోయింది..!

Kovai Sarala| కోవై స‌ర‌ళ‌.. ఈ పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న‌దైన కామెడీతో హాస్యాన్ని పంచి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఈమె 1979లో ఆర్.కృష్ణా డైరెక్షన్లో వచ్చిన’ వెళ్లి రత్నం‘ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది..ఇండస్ట్రీలో ఎక్కువగా నటుడు బ్రహ్మానందం తో కలిసి ఎన్నో సినిమాలలో భార్యాభర్తలుగా క‌లిసి న‌టించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించారు. తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడా పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోని కోవై స‌ర‌ళ ఒంట‌రి జీవితాన్ని అనుభ‌విస్తుంది.

కోవై స‌ర‌ళ అవ్వ‌డానికి త‌మిళ క‌మెడీయ‌న్ అయిన కూడా తెలుగు బాగా మాట్లాడుతుంది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది.ఒక‌ప్పుడు చాలా సినిమాలు చేసిన కోవై స‌ర‌ళ ఇప్పుడు ఏదో అలా అడ‌పాద‌డ‌పా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తుంది. తెలుగులో చివరిసారిగా 2015లో కిక్ 2 సినిమాలో కనిపించింది కోవై సరళ. ఆ తర్వాత నాలుగు డబ్బింగ్ సినిమాలతో ప‌ల‌క‌రించింది కాని తెలుగు స్ట్రైట్ సినిమా చేయ‌లేదు. అయితే ఇప్పుడు మ‌రో సారి డ‌బ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచ‌నుంది. తమిళ్ లో సూపర్ హిట్ హారర్ కామెడీ సిరీస్ అరణ్‌మనై కి నాలుగో సీక్వెల్ తెలుగులో ‘బాక్’ గా రిలీజ్ కాబోతుంది. కుష్బూ నిర్మాణంలో, కుష్బూ భర్త మెయిన్ లీడ్ చేస్తూ ఆయన దర్శకత్వంలోనే ఈ అరణ్‌మనై 4 సినిమా తెరకెక్కింది.

రాశిఖన్నా, తమన్నా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తుండ‌గా, ఈ చిత్రాన్ని మే 3న తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. అయితే మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ నిన్న రాత్రి హైదరాబాద్ లో జ‌రిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కుష్బూ, తమన్నా, రాశిఖన్నాతో పాటు కోవై సరళ కూడా వచ్చారు.. ఆమె లుక్ చాలా మారిపోయింది. హెయిర్ కట్ తో కళ్లజోడు పెట్టుకొని కనిపించారు. ఏజ్ పెరిగిన ఛాయ‌లు ఆమె ముఖంలో క‌నిపిస్తున్నాయి. బాక్ ఈవెంట్ నుంచి కోవై సరళ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మార‌గా, ఎలా ఉండే కోవై స‌ర‌ళ ఎలా మారిపోయింద‌ని కామెంట్ చేస్తున్నారు.