Rashmika Mandanna | ‘లక్ష్మీపతి’తో రష్మిక కొత్త బంధం

నేషనల్ క్రష్ రష్మిక మందన్న 'లక్ష్మీపతి' చీరల యాడ్‌తో చక్కగా మెరిసింది. అదే సమయంలో 'డియర్ డైరీ' పేరుతో ఫెర్ఫ్యూమ్ బ్రాండ్‌ని లాంచ్ చేసి బిజినెస్ రంగంలో అడుగుపెట్టింది. సినీ కెరీర్‌తో పాటు వ్యాపార రంగంలోనూ విజయాల దూకుడు కొనసాగుతోంది.

Rashmika Mandanna | ‘లక్ష్మీపతి’తో రష్మిక కొత్త బంధం

Rashmika Mandanna | విధాత: సినిమా రంగంలో పాన్ ఇండియా స్టార్ ..నేషనల్ క్రష్ గా ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందన్నపేరుతో పాటు భారీగానే ఆదాయ ఆర్జన సాగిస్తుంది. సినిమాలే కాకుండా వ్యాపార ప్రకనలతో సంపాదిస్తున్న రష్మిక ఇటీవల చాల మంది సినీ, క్రీడా స్టార్స్ మాదిరిగానే బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నయనతార, సమంత లాంటి స్టార్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రష్మిక కూడా అదే బాటలో ‘డియర్ డైరీ’ పేరుతో ఓ ఫెర్ఫ్యూమ్ బ్రాండ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫెర్ఫ్యూమ్ ధరల విషయానికొస్తే రూ.1600, రూ.2600 రేంజులో ఉన్నాయి.

ఇది ఇలా ఉండగానే ‘లక్ష్మీపతి’చీరల సంస్థ వ్యాపార ప్రకటనలో సందడి చేసింది. ఉడ్ ఉడ్ అంటూ పాటతో సాగే లక్ష్మీపతి చీరల యాడ్ లో సాటి మహిళలతో కలిసి పతంగులు ఎగరేస్తూ సందడి చేసింది. ఈ యాడ్ చూసిన నెటిజన్లు లక్ష్మీపతి చీరల ప్రమోషన్ యాడ్ లో రష్మిక చాల బాగుందని.. కళ్ళు స్క్రీన్‌కే అతుక్కుపోయాయని కామెంట్లు పెట్టారు. యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర.. ఇలా వరస బ్లాక్‌బస్టర్స్ కొట్టిన రష్మిక.. మైసా సినిమాలో నటిస్తుంది. హీరోయిన్‌గా సూపర్‌ ఫామ్‪‌ కొనసాగిస్తునే రష్మిక తాజాగా ఫెర్ఫ్యూమ్ బ్రాండ్‌ వ్యాపారంలో, చీరల యాడ్స్ లోనూ అందరిని ఆకట్టుకోవడం చూస్తే ఆమె నిజంగా లక్కీ స్టార్ అని అంటున్నారు.