నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవలు.. రంగంలోకి దిగిన నాగబాబు
విధాత:నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని.. తన భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్‌మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో నిహారిక భర్త సైతం అపార్ట్‌మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేశారు. ఏడుమంది అపార్ట్‌మెంట్ వాసులు గతకొన్ని రోజులుగా నిహారిక భర్త స్నేహితులు ఫ్లాట్‌కి వస్తుండటం, అర్థరాత్రి సమయంలో పార్టీలు చేసుకుంటూ..గొడవలు చేస్తున్నారని, మాపై […]

విధాత:నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని.. తన భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్‌మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో నిహారిక భర్త సైతం అపార్ట్‌మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేశారు.

ఏడుమంది అపార్ట్‌మెంట్ వాసులు గతకొన్ని రోజులుగా నిహారిక భర్త స్నేహితులు ఫ్లాట్‌కి వస్తుండటం, అర్థరాత్రి సమయంలో పార్టీలు చేసుకుంటూ..గొడవలు చేస్తున్నారని, మాపై దురుసుగా ప్రవర్తించాడని నిహారిక భర్తపై కంప్లైంట్ చేశారు. అయితే చైతన్య వర్షన్ వేరేలా ఉంది. కావాలనే అపార్ట్‌మెంట్ వాసులు మమ్మలిని టార్గెట్ చేసి మాతో వాగ్వాదానికి దిగారని ఆరోపించాడు. దీంతో ఇరు వర్గాలు ఇచ్చిన కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు ఈ గొడవ జరగడానికి కారణాలేంటి..? అనే కోణంలో సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
