OG Movie Ticket Record Price| పిచ్చి పీక్స్..ఓజీ సినిమా టికెట్ రూ.1,29,999

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ని శ్రీనివాసా థియేటర్లో పవన్‌ కల్యాణ్‌ ఓజీ సినిమా బెనిఫిట్‌ షో టికెట్‌ టికెట్‌ ధర వేలంపాటలో రూ.1,29,999 పలికింది. ఈ ఘటన సినీ హీరోల పట్ల అభిమానుల వేలం వెర్రికి నిదర్శనంగా నిలిచింది.

విధాత : సినీ హీరోల పట్ల అభిమానులు చూపే అభిమానాలు తరుచు వేలం వెర్రిగా మారిపోతూ హద్దులు దాటుతుంటాయి. తాజాగా సుజీత్‌ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌ ఓజీ సినిమా (OG Movie)సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదల కానుండగా..మరోవైపు అభిమానులు సినిమా టికెట్ల కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తుండగా.. హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఏపీలో పవన్ అభిమానులు నిర్వహిస్తున్న టికెట్ల వేలం పాటలో ఓ అభిమాని టికెట్ రూ.1లక్షకు కొనుగోలు చేయగా..తెలంగాణ అభిమానులు ఆ రికార్డు బద్దలు కొట్టారు.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ని శ్రీనివాసా థియేటర్లో పవన్‌ కల్యాణ్‌ ఓజీ సినిమా బెనిఫిట్‌ షో (Benefit Show Ticket ) టికెట్‌  ధర వేలంపాటలో రూ.1,29,999 పలికింది(Record Ticket Price). వేలం పాటకు(Ticket Auction) జబర్దస్త్‌ ఫేమ్‌ వినోదిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో వేలం పాటలో పాల్గొన్నారు. వేలం పాటలో బెనిఫిట్‌ షో టికెట్‌ ను లక్కారం గ్రామానికి చెందిన పవన్ అభిమాని ఆముదాల పరమేష్‌ రూ.1,29,999లకు దక్కించుకున్నారు. టికెట్‌ డబ్బును జనసేన ఆఫీసుకు ఇస్తామని పవన్ అభిమానులు తెలిపారు.