Ashwini Dutt | మెగాస్టార్‌తో ఐదవ సినిమా చేస్తాం: అశ్వినీ దత్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో తమ సంస్థ వైజయంతి మూవీస్ (Vyjayanthi movies) బ్యానర్లో ఐదవ సినిమా చేస్తామని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ప్రకటించారు.

Ashwini Dutt | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో తమ సంస్థ వైజయంతి మూవీస్ (Vyjayanthi movies) బ్యానర్లో ఐదవ సినిమా చేస్తామని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా అతడు నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇంద్ర (Indra) సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవ్వడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ థియేటర్లలో సందడి చేశారు. కొన్ని రోజులుగా మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లన్ని ఇంద్ర ఎఫెక్ట్‌తో తెరచుకున్నాయి. ఇంద్ర 22సంవత్సరాల తర్వాత రీ రిలీజై ప్రేక్షకాదరణ పొంది నేపథ్యంలో చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు.
‘ఇంద్ర’ క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ
22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయిన సందర్భంగా, ‘ఇంద్ర’ టీంకి ‘చిరు’ సత్కారం!
అలాగే ప్రొడ్యూసర్ @AshwiniduttCh గారు, డైరెక్టర్ B.Gopal, మరపురాని డైలాగ్స్ ని అందించిన #ParuchuriBrothers , కధనందించిన చిన్ని క్రిష్ణ,… pic.twitter.com/UfGpOd2gkE— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2024
అయితే ఈ సినిమా రీ రిలీజ్ అయ్యిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న క్రమంలో ఇంకవైపు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వారికి మరో క్రేజీ అప్డేట్ను ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కానుకగా ఈ విషయాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నామని వైజయంతీ మూవీస్ నిర్మాత అశ్వినీదత్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో వైజయంతీ మూవీస్ బ్యానర్లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’, ‘జై చిరంజీవ’ వంటి నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయని గుర్తు చేశారు.
మెగాస్టార్‌తో ఐదవ సినిమా చేస్తాం : అశ్విని దత్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా అతడు నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవ్వడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ థియేటర్లలో పండగా చేసుకున్నారు. కొన్ని…
— Suresh Kondeti (@santoshamsuresh) August 23, 2024
త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో ఐదవ సినిమా ఉండబోతుందంటూ అశ్వినీ దత్ ప్రకటించారు. అశ్వినీ దత్ ప్రకటన చిరు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఇప్పటికే చిరంజీవి కేరియర్లో అత్యంత భారీ బడ్జెట్ 200కోట్లతో నిర్మితమవుతున్న విశ్వంభర జనవరిలో ప్రేక్షకులకు ముందు రానుండగా, ఇప్పుడు కల్కీతో 1000కోట్ల నిర్మాతగా మారిన అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ సంస్థ చిరంజీవితో తెరకెక్కించే చిత్రం కూడా అంతకంటే భారీ స్థాయిలో ఉంటుందంటు సంబరపడుతున్నారు