‘పుష్ప’ సెకండ్ పార్ట్‌పై క్లారిటీ ఇచ్చేసిన నిర్మాతలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా ఒకటా.. రెండు బాగాలా అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు పుష్ప ఒక భాగమే అని కొందరు.. లేదు లేదు రెండు భాగాలు అంటూ మరి కొందరు సోషల్ మీడియాలో షేర్ చూస్తూ వచ్చారు. పుష్ప సినిమా కథ ఒక భాగంలో చెప్పడం కష్టం అని రెండు భాగాలు చేయబోతున్నాడు దర్శకుడు. కొంత కాలంగా ఈ సినిమా గురించి వస్తున్న వార్తలను నిర్మాతలు కూడా కన్ఫర్మ్ […]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా ఒకటా.. రెండు బాగాలా అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు పుష్ప ఒక భాగమే అని కొందరు.. లేదు లేదు రెండు భాగాలు అంటూ మరి కొందరు సోషల్ మీడియాలో షేర్ చూస్తూ వచ్చారు. పుష్ప సినిమా కథ ఒక భాగంలో చెప్పడం కష్టం అని రెండు భాగాలు చేయబోతున్నాడు దర్శకుడు. కొంత కాలంగా ఈ సినిమా గురించి వస్తున్న వార్తలను నిర్మాతలు కూడా కన్ఫర్మ్ చేశారు. పుష్ప రెండు భాగాలుగా వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే దీనివెనుక చాలా పెద్ద బిజినెస్ లెక్కలున్నాయి. ప్రస్తుతం సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారు. దాంతో ఈ సినిమాకు 90 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. బిజినెస్ కూడా 120 కోట్లకు పైగానే చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇలాంటి సమయంలో ఒక భాగం తీసి అందులో మూడు గంటల సినిమా చూపిస్తే ప్రేక్షకులకు బోర్ కొట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకే తీరిగ్గా రెండు భాగాలు చేస్తున్నాడు సుకుమార్. ఇక్కడ మరో లాభం కూడా ఉంది. రెండు భాగాలు అంటే బిజినెస్ కూడా రెండు రకాలుగా చేసుకోవచ్చు. మొదటి భాగానికి ఇంత.. రెండో భాగానికి అంత అంటూ లెక్కలు వేసుకోవచ్చు. అయితే ఇలా రెండు భాగాలుగా చేసినప్పుడు లాభం ఎంత ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. ఒకవేళ తొలి భాగం హిట్టయితే పర్వాలేదు.. కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఎన్టీఆర్ బయోపిక్ కు వచ్చిన రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది.
కేవలం బిజినెస్ పరంగా రెండు భాగాలు చేస్తే వర్కౌట్ అవ్వదు. నిజంగా కథలో విషయం ఉండి రెండు భాగాలుగా చెప్పే వీలు ఉంటే అప్పుడు వర్కౌట్ అవుతుంది. తన సినిమాలో ఆ ఎమోషన్ ఉంది అంటున్నాడు సుకుమార్. ఒకే భాగంలో చెప్పలేం కాబట్టి రెండు భాగాలు చేస్తున్నాము అంటున్నారు. అందులో ఎలాంటి బిజినెస్ లెక్కలు చూసుకోవడం లేదని.. ఒక మంచి సినిమాను అందించాలి అనే ఉద్దేశంతోనే రెండు భాగాలు చేస్తున్నాము అంటున్నాడు సుకుమార్. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ అయిపోయింది. రెండో భాగం కూడా దాదాపు పది శాతం షూటింగ్ పూర్తి చేశారు. 2021లో పుష్ప మొదటి భాగం విడుదల కానుంది. వచ్చే ఏడాది రెండో భాగం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. పుష్ప రెండు భాగాలు కలిపి 200 కోట్లకు పైగా బిజినెస్ చేయడం ఖాయం. ఇదే ఒకవేళ ఒక భాగం వస్తే బిజినెస్ 120 కోట్లు దాటదు. దర్శక నిర్మాతలకు ఇది కూడా లాభమే. మరి చూడాలి ఈ సినిమా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో..?