Rashmi Goutham | ర‌ష్మీ డ్రెస్సుల సైజ్ త‌గ్గించాలంటూ ధ‌ర్నాలు.. యాంకరమ్మ రియాక్ష‌న్ ఏంటి?

Rashmi Goutham| బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ ర‌ష్మీ గౌత‌మ్. అన‌సూయ త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజ్‌లో షోకి స్పెష‌ల్

  • By: sn    cinema    Jun 06, 2024 8:30 AM IST
Rashmi Goutham | ర‌ష్మీ డ్రెస్సుల సైజ్ త‌గ్గించాలంటూ ధ‌ర్నాలు.. యాంకరమ్మ రియాక్ష‌న్ ఏంటి?

Rashmi Goutham| బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ ర‌ష్మీ గౌత‌మ్. అన‌సూయ త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజ్‌లో షోకి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారింది అంటే ర‌ష్మీ గౌత‌మ్ అని చెప్పాలి. అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్‌కి గ్లామ‌ర్ అద్ద‌గా, దానిని ర‌ష్మీ కూడా కంటిన్యూ చేస్తూ వ‌చ్చింది. పొట్టి పొట్టి దుస్తుల‌లో ర‌చ్చ చేస్తూ, వ‌చ్చి రాని తెలుగు మాట్లాడి వినోదం పంచ‌డం వంటివి చేస్తుంది ర‌ష్మి. అయితే ర‌ష్మీ గౌత‌మ్ మ‌ల్లెమాల‌కి సంబంధించిన అన్ని షోల‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తూ వ‌స్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ వంటి షోల‌కి ర‌ష్మీ యాంక‌ర్‌గా ఉంటూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.

జబర్దస్త్ షో గ‌తంలో రెండుగా ఉండేది. ఇప్పుడు ఒక్కటగా ప్రసారం అవుతుంది. ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్‌కి ఎండ్ కార్డ్ వేయ‌డంతో జ‌బ‌ర్ధ‌స్త్ షోని రెండు రోజుల పాటు ప్ర‌సారం చేస్తున్నరు. అయితే ఎక్ట్స్ ట్రా జబర్దస్త్ షో ని తీసేయడం పట్ల జబర్దస్త్ కమెడియన్లు ధర్నాకి దిగారు. రౌడీ రోహిణి కొంతమంది మహిళలను వేసుకుని వచ్చి ధర్నాకి దిగింది. ఒక ఆడియెన్ గా `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోని చాలా మిస్‌ అవుతున్నామని, టీవీల్లో రోజూ చూసేవాళ్లమని పేర్కొంది. అస‌లు దీనిని ఎందుకు తీసేసారంటూ క‌న్నీరు మున్నీరుగా విల‌పించింది. ఆ స‌మ‌యంలో రామ్ ప్ర‌సాద్ కాస్త క‌వర్ చేశాడు. ఇక జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్స్ తో రోహిణి ధ‌ర్మాకి దిగిన స‌మ‌యంలో వారు తెచ్చిన ప్ల‌క్కార్డుల పైన `రష్మి డ్రెస్‌ సైజ్‌ తగ్గించాలి` అనే డిమాండ్‌ ఉండటం విశేషం.

రష్మి డ్రెస్‌ తగ్గించాలని తాము డిమాండ్ చేయ‌డంతో పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ మళ్లీ రావాలని, సన్నీకి పెళ్లి అవుతుందా అనే ప్లకార్డులు కూడా ఉండటం విశేషం. అయితే డ్రెస్ సైజ్ త‌గ్గించ‌మ‌ని వారు డిమాండ్ చేసిన నేప‌థ్యంలో ర‌ష్మీ స్పందిస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్ చేసింది. తాను కూడా అదే చెబుతున్నా అని, తగ్గిస్తానంటే వద్దంటున్నారంటూ పెద్ద షాకిచ్చింది రష్మి. తనకు డ్రెస్‌ సైజ్‌ తగ్గించాలని ఉన్నా, షో నిర్వహకులు వద్దు అంటున్నారనే అర్థంలో రష్మి గౌతమ్ చెప్పుకురావ‌డం విశేషం. ప్రోమో చాలా ఆస‌క్తిక‌రంగా ఉండ‌గా, ఎపిసోడ్ కూడా ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని అంటున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ ఈ వారం నుండి ప్ర‌తి శుక్ర‌, శ‌ని వారాల‌లో రాత్రి 9.30 ని.ల‌కి ప్ర‌సారం కానుంది.