Sadha| అరెంజ్ మ్యారేజ్‌కి నేను వ్య‌తిరేఖం.. విడాకులు తీసుకోవ‌డంలో త‌ప్పు లేద‌న్న స‌దా

Sadha| జ‌యం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ స‌దా. వయసు పెరుగుతున్న కొద్ది హీరోయిన్ సదా అందం మరింత రెట్టింపు అవుతుంది. రోజురోజుకూ ఫిట్ గా, యంగ్ గా మారుతున్న ఈ బ్యూటీ అదిరిపోయే ఔట్ ఫిట్లతో ఫోటోషూట్ లు చేస్తూ కుర్ర‌కారుని కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ప్ర‌

  • By: sn    cinema    Jun 16, 2024 7:45 AM IST
Sadha| అరెంజ్ మ్యారేజ్‌కి నేను వ్య‌తిరేఖం.. విడాకులు తీసుకోవ‌డంలో త‌ప్పు లేద‌న్న స‌దా

Sadha| జ‌యం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ స‌దా. వయసు పెరుగుతున్న కొద్ది హీరోయిన్ సదా అందం మరింత రెట్టింపు అవుతుంది. రోజురోజుకూ ఫిట్ గా, యంగ్ గా మారుతున్న ఈ బ్యూటీ అదిరిపోయే ఔట్ ఫిట్లతో ఫోటోషూట్ లు చేస్తూ కుర్ర‌కారుని కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ప్ర‌స్తుతం టెలివిజన్ షోలలో జడ్జ్ గా చేస్తూ తన నేచురల్ లుక్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. ఇక అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ హాట్ టాపిక్ అవుతుంటుంది. స‌దా ముంబై గోవా మధ్యలో ఉండే రత్నగిరి అనే ప్రాంతానికి చెందిన ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది. ఆమెకి సినిమాల‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఆమె తల్లి ప్రభుత్వ ఉద్యోగి కాగా, ఆమె తండ్రి డాక్టర్.

ఇక రక్తం అంటే తనకున్న భయం కారణంగా మెడిసిన్ కాకుండా ఇంజనీరింగ్ కోసం బాంబే వెళ్లిన అక్క‌డ యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అయి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ప‌లు షోల‌లో సంద‌డి చేస్తుంది. అయితే పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ పోతుంది అన్న ఉద్దేశంతో ఇప్పటిదాకా పెళ్లి వైపు అడుగులు వేయలేదు సదా. తనకు నచ్చిన వ్యక్తి దొరకలేదని , ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ కూడా త‌న‌కి కలగలేదని తెలిపింది. ఇక అరెంజ్‌ మ్యారేజ్‌, లవ్‌ మ్యారేజ్‌ గురించి మాట్లాడిన స‌దా, తాను అరెంజ్‌ మ్యారేజ్‌ కాన్సెప్ట్ కి పూర్తి వ్యతిరేకమని, అది తనకు నచ్చదని తెలిపింది సదా.

పరిచయం లేని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటారు,వారు ఎలా ఉంటారనేది తనకు అర్థం కాదని పేర్కొంది. అయితే అరెంజ్డ్ మ్యారేజ్ నచ్చే వాళ్లు కూడా ఉంటారు, అలా మ్యారేజ్‌ చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్లు కూడా చాలా మంది ఉంటారు, వారిని తాను తప్పుపట్టడం లేదని, కానీ తనకు మాత్రం ఆ కాన్సెప్ట్ నచ్చదని చెప్పింది సదా. తాను పెళ్లి చేసుకుంటే లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటానని, తన పేరెంట్స్ ది కూడా లవ్‌ మ్యారేజే అనిమ‌పేర్కొంది.విడాకుల అంశంపై స్పందిస్తూ, మ్యారేజ్‌ చేసుకోవడం ఇష్టం లేని వారికి బ‌ల‌వంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. అమ్మాయికి, అబ్బాయికి మ్యారేజ్‌ చేసుకోవాలనే ఫీలింగ్‌ కలగాలి, ఒక మనిషి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలని అనిపించాలి, అతన్ని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటామనే ఫీలింగ్‌ కలగాలని తెలిపింది సదా. పెళ్లి చేసుకున్నాక లైఫ్ స‌జావుగా సాగ‌క‌పోతే, భరించడం కష్టంగా ఉందనిపిస్తే విడాకులు తీసుకోవడంలోనూ తప్పులేదు. తాను పెళ్లి సిస్టమ్‌కి వ్యతిరేకం కాదని, అలాగని ఇబ్బంది పడుతూ ఉండటం కూడా కరెక్ట్ కాదనేది తన అభిప్రాయం అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది అందాల స‌దా.