Salman Khan| బిష్ణోయ్ గ్యాంగ్ వలన చాలా భయపడిపోతున్న సల్మాన్.. ఇక్కడికి రావాలనిపించలేదంటూ కామెంట్
Salman Khan| ఒకప్పుడు సరదాగా, సంతోషంగా ఉండే సల్మాన్ ఖాన్‌కి ఇటీవల కంటిపై కునుకు ఉండడం లేదు.బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులతో సల్మాన్ ఖాన్ బయట అడుగుపెట్టేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా సల్మాన్ ఆప్త మిత్రుడు, ఎన్సీపీ లీడర్ బాబా సిద్దిఖీ హత్యానంతరం సల్మాన్ ఖా

Salman Khan| ఒకప్పుడు సరదాగా, సంతోషంగా ఉండే సల్మాన్ ఖాన్(Salman Khan)కి ఇటీవల కంటిపై కునుకు ఉండడం లేదు.బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులతో సల్మాన్ ఖాన్ బయట అడుగుపెట్టేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా సల్మాన్ ఆప్త మిత్రుడు, ఎన్సీపీ లీడర్ బాబా సిద్దిఖీ హత్యానంతరం సల్మాన్ ఖాన్‌కి బెదిరింపులు పెరిగిపోయాయి. ప్రస్తుతం సల్మాన్ సెక్యూరిటీని మరింత పెంచేశారు. ఆయన వై + సెక్యూరిటీని పోలీసులు మరింత పటిష్టం చేశారు.గతంలో ఆయన మచ్చల జింకను చంపి తిన్నందుకు.. బిష్ణోయ్ గ్యాంగ్(Bishnoi Gang) ఆయనపై కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బిష్ణోయ్ గ్యాంగ్..ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ కూడా చేశారు. రూ. 5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ను చంపేస్తామన్నారు.
అయితే సల్మాన్ ఖాన్‌కి బెదిరింపులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆయన బిగ్‌బాస్(Bigg Boss) షోకి అటెండ్ అవుతారా అనే చర్చ కూడా ఊపందుకుంది.. అయితే ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ భారీ సెక్యూరిటీ మధ్యన సల్మాన్ వరుసగా రెండు రోజులు బిగ్‌బాస్ షూట్‌కి హాజరయ్యారు. షోలో సల్మాన్ మాట్లాడుతూ.. నాకు అయితే షోకి రావాలని కూడా లేదు. కానీ నిబద్ధత ఉన్నందున నేను రావాల్సి వచ్చింది. నా పని ఇది కాబట్టి, ఒప్పుకున్నా కాబట్టి రావడం జరిగింది.. నేను ఎవరితోనూ కలవొద్దు అనుకున్న. మీ అందర్నీకూడా కలవొద్దు అనుకున్న కాని కమిట్‌మెంట్ కోసం రాక తప్పలేదు అన్నట్టుగా హౌజ్‌లోని కంటెస్టెంట్‌తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. మరోవైపు మరోవైపు తన వ్యక్తిగత రక్షణ కోసం ఇప్పటికే లైసెన్స్ రివాల్వర్ తీసుకున్న సల్మాన్(Salman Khan).. రీసెంట్‌గా రూ.2 కోట్లు విలువైన బుల్లెట్ ప్రూఫ్ కొనుగోలు చేశాడు.
అలాగే సల్మాన్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన ముంబై పోలీసులు(Mumbai Police).. ఫోటోగ్రాఫర్స్, సెల్ఫీలు, అభిమానులు, సన్నిహితులకు అనుమతి నిరాకరించారు. మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడి బిష్ణోయ్ వర్గానికి చెందిన సభ్యులను గాలిస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అర్పిత బాంద్రాలోని తన ఇంటిని అమ్మేసినట్లు ఇటీవల జోరుగా ప్రచారాలు సాగాయి. ఆమె బాంద్రా నుండి వర్లీకి మారుతుందని.. అందుకే ఆమె తన ఇంటిని అమ్మేసిందని తెలుస్తోంది. మొత్తానికి సల్మాన్ ఖాన్ ఈ పరిణామలతో ఇటీవల చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడని అర్ధమవుతుంది.