విడాకులకు కారణం ఇతనేనా.. సమంతపై అవమానకర ప్రచారం..!
విధాత: తన స్వేచ్చ, కెరీర్ ని అడ్డుకునే ప్రయత్నాలు తీవ్రతరం అవ్వటంతో బరువెక్కిన గుండెతో.. హృదయం నిండా బాధతో.. ఎవరిపై ఎలాంటి విమర్శలు చేయాలో తెలియని పరిస్థితిల్లో తన విడాకులపై సమంత సంచలన పోస్టులతో సోషల్ మీడియాని హీటెక్కిస్తుంటే.. మేము విడిపోతున్నాం అని ఒక్క మాటతో సరిపెట్టసాడు చైతు. సమంత మాత్రం అనుమానాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. తన విడాకుల వెనుకాల ఎవరో కుట్రలు, కుతంత్రాలు చేశారని.. వారంతా సర్వనాశనం అయిపోతారని అర్ధం వచ్చేలా కామెంట్స్ చేస్తుంది. హీరోలు […]

విధాత: తన స్వేచ్చ, కెరీర్ ని అడ్డుకునే ప్రయత్నాలు తీవ్రతరం అవ్వటంతో బరువెక్కిన గుండెతో.. హృదయం నిండా బాధతో.. ఎవరిపై ఎలాంటి విమర్శలు చేయాలో తెలియని పరిస్థితిల్లో తన విడాకులపై సమంత సంచలన పోస్టులతో సోషల్ మీడియాని హీటెక్కిస్తుంటే.. మేము విడిపోతున్నాం అని ఒక్క మాటతో సరిపెట్టసాడు చైతు. సమంత మాత్రం అనుమానాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. తన విడాకుల వెనుకాల ఎవరో కుట్రలు, కుతంత్రాలు చేశారని.. వారంతా సర్వనాశనం అయిపోతారని అర్ధం వచ్చేలా కామెంట్స్ చేస్తుంది. హీరోలు ఏమైనా చేయొచ్చు… కానీ హీరోల కుటుంబాల్లోని ఆడవాళ్లు ఎక్స్ పోజింగ్ చేస్తే హీరోలతో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేరు. అమల బ్లూ క్రాస్ లాగా…సమంత ఏదైనా ఎన్జీవో నూ చూసుకుంటూ అణిగిమనిగి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు. అందరూ అమలలా ఉండరు కదా..! స్వతంత్ర భావాలున్న మహిళలు వంటింట్లో ఇమడరు కదా అని సమంతని సపోర్ట్ చేస్తూ కూడా ఒక వర్గం సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
అయితే సమంత విడాకులపై అక్కినేని ఫ్యాన్స్ లోని కొందరు నెగిటీవ్ ట్రోలింగ్ కి తెరలేపుతున్నారు. సమంతానే అక్కినేని ఫ్యామిలీతో ఉండలేక విడిపోతుందని అంటున్నారు. బోల్డ్ సినిమాల్లో నటించటం, డ్రెస్సింగ్ స్టైల్, పిల్లలపై ఫోకస్ పెట్టకపోవడం ఇలా ఏవేవో రీజన్స్ చెప్తూ.. సమంతని బ్యాడ్ చేసే ట్రోలింగ్ నడుస్తుంది. అయితే ఇది ఒక రేంజ్ అయితే.. మరో ప్రమాదకర నెగిటీవ్ ట్రోలింగ్ కూడా కొందరు చేస్తున్నారు. సమంత వ్యక్తిగత ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ ఒడిలో కాళ్లు పెట్టుకుని దిగిన ఫోటోను అడ్డుపెట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. అక్కినేని ఇంటి కోడలు అయిఉండి.. సమంత ఇంకా బ్యాచ్ లర్ లానే ప్రవర్తిస్తుందని.. పెద్ద కుటుంబాల్లో పద్ధతులు పాటించాలని.. అప్పుడెప్పుడో సమంత పెట్టి డిలీట్ చేసిన ఈ పోస్ట్ ని వాడుకుంటున్నారు ట్రోలర్స్.
సమంత అప్పట్లో పెట్టిన ఈ పాత పోస్టులో తన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ ఒడిలో కాళ్లు పెట్టుకుని దిగిన ఫోటోను కొన్నాళ్ల క్రితం సమంత ఇంస్టాగ్రామ్ లో పెట్టడం.. అక్కినేని కుటుంబం తో పాటు ఫాన్స్ నొచ్చుకోవడంతో వివాదం ముదిరింది. ఆ తర్వాత పరిణామాలతో తారాస్థాయికి చేరుకుంది. తాజాగా విడాకులతో శుభం కార్డు పడింది. అయితే తాజాగా సమంత విడాకులు ప్రకటించిన తరువుత ఈ ఫ్యాషన్ డిజైనర్ పెట్టి డిలీట్ చేసిన మరో పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. ప్రీతమ్ జుకల్కర్ స్టేటస్ లో… ‘అబద్దాలు, రహస్యాలు బంధాలని చంపేస్తాయి. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదోకరోజు దొరికిపోతావ్’ అని స్టేటస్ పెట్టి.. మళ్ళీ క్షణాల్లో డిలిట్ చేశాడని.. ప్రీతమ్ జుకల్కర్ ఎవర్ని ఉద్దేశించి ఈ స్టేటస్ పెట్టాడో అని కొందరు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. సామ్ చేల విడాకులు మాత్రం తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది.