Samantha| ఆ పోస్ట్‌తో ఒక్క‌సారిగా షాకిచ్చిన స‌మంత‌… ఏంటి నిజంగానే ప్ర‌గ్నెంటా అంటూ నెటిజ‌న్ల కామెంట్స్

Samantha| టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత ఈ మ‌ధ్య సినిమాల‌తో పెద్ద‌గా అల‌రించ‌క‌పోయిన సోషల్ మీడియా పోస్ట్‌ల‌తో మాత్రం తెగ సంద‌డి చేస్తుంది. మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జ‌నాలకి అవేర్‌నెస్ క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే స‌మంత కొన్ని నెల‌లుగా ఇబ్బం

  • By: sn    cinema    Jul 28, 2024 6:49 AM IST
Samantha| ఆ పోస్ట్‌తో ఒక్క‌సారిగా షాకిచ్చిన స‌మంత‌… ఏంటి నిజంగానే ప్ర‌గ్నెంటా అంటూ నెటిజ‌న్ల కామెంట్స్

Samantha| టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత ఈ మ‌ధ్య సినిమాల‌తో పెద్ద‌గా అల‌రించ‌క‌పోయిన సోషల్ మీడియా పోస్ట్‌ల‌తో మాత్రం తెగ సంద‌డి చేస్తుంది. మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జ‌నాలకి అవేర్‌నెస్ క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే స‌మంత కొన్ని నెల‌లుగా ఇబ్బందిక‌ర పరిస్థితుల‌ని ఎదుర్కొంటుంది. నాగ చైత‌న్య‌తో విడాకులు, ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కి మ‌యోసైటిస్ బారిన ప‌డ‌డం ఆమెని బాగా కుంగ‌దీసింది. కాని వాటిని కూడా స‌మ‌ర్ధంగా ఎదుర్కొంది. స‌మంత మెంట‌ల్‌గా, ఆరోగ్య ప‌రంగా ఇప్పుడు బాగానే ఉంది. త్వ‌ర‌లోనే ఆమె తిరిగి సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఈ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ పేరుతో స్వీయ నిర్మాణంలో కొత్త సినిమా అనౌన్స్ చేసింది స‌మంత‌.. అది ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో సమంత పునరాగమనం ఎప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి స‌మ‌యం ప‌ట్టేలా క‌నిపిస్తుంది. ఆ లోపు స‌మంత సిటాడెల్ వెబ్ సిరీస్‌తో సంద‌డి చేయ‌బోతుంది. హాలీవుడ్లో ఇదే పేరుతో తెరకెక్కిన ఒరిజినల్‌కు ఇది ఇండియన్ వెర్షన్ కాగా, ఈ వెబ్ సిరీస్ షూట్ ఎప్పుడో పూర్తయినా.. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావ‌డంతో డేట్ అనౌన్స్ చేయ‌లేదు. అయితే ఇటీవ‌ల రాజ్ -డీకే ట్విట్ట‌ర్‌లో ‘01.08’ అని ఉన్న పోస్టర్ ఒకటి షేర్ చేశారు. దానికి క్యాప్షన్‌గా తేనె డబ్బా, కుందేలు బొమ్మలుండ‌డంతో అంద‌రు అవి హనీ, బన్నీలకు సంకేతాలు అని , ఆగస్టు 1న ‘సిటాడెల్’ రాబోతున్నట్లే అని అనుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే స‌మంత తాజాగా తన కారులో కూర్చొని ఏదో ఓపెన్ చేస్తున్న‌ట్టుగా ఉన్న పిక్ షేర్ చేసింది. ఇది చూసిన వారు ఇదేదో ప్ర‌గ్నెంట్ కిట్ మాదిరిగా ఉంది, కొంప‌దీసి స‌మంత ప్ర‌గ్నెంటా అని కామెంట్స్ చేయ‌డం మొద‌లు పెట్టేశారు.కాక‌పోతే అందులో ఫైండ్ హ‌నీ 01/08 అని రాసి ఉంది. ఇక ఇది చూసాక స‌మంత అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. ఆ కిట్ చూశాక ప్ర‌గ్నెంట్ కిట్‌లా అనిపించ‌డంతో ఆమె త‌న ప్ర‌గ్నెంట్ చెప్ప‌డమేంట‌ని షాక్ అయ్యాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే స‌మంత చేసిన పోస్ట్ హ‌నీ బ‌న్నీకి సంబంధించింద‌ని, ఆగ‌స్ట్ 1న వెబ్ సిరీస్‌కి సంబంధించిన అప్డేట్ రానుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు.