SSMB29 | మహేష్ బాబు – రాజమౌళి సినిమా అప్డేట్..వైరల్ గా ఫ్రీలుక్
మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా రాజమౌళి ‘SSMB29’ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ ఫోటో విడుదల. నవంబర్‌లో పూర్తి లుక్ రివీల్ చేయనున్నట్టు ప్రకటించారు.

SSMB29 | విధాత : సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) బర్త్ డే సందర్భంగా దర్శక వీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎస్ఎస్ఎంబీ 29(SSMB29) సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వెలువడింది. మహేశ్ బాబు బర్త్ డే పురస్కరించుకుని రాజమౌళి మహేష్ బాబు పాత్రకు సంబంధించిన ఓ ఫ్రీ లుక్ ఫోటోను రిలీజ్ చేశారు. అది కూడా మహేష్ ముఖం కనిపించకుండానే ఛాతితో కూడిన ఫోటోతో ఆ ఫోటో ఉంది. మెడలో శివుడి లింగాకరంలోని మూడు నామాలు..త్రిశూలం, ఢమరుకం, నందితో కూడిన రుద్రాక్ష మాల వేసుకుని మహేశ్ బాబు ఫోటోను విడుదల చేశారు. మెడ నుంచి రక్తం కారినట్లుగా కనిపిస్తుంది. అయితే దీని పూర్తి లుక్‌ను నవంబర్‌లో(November) రివీల్ చేస్తామని అప్పటివరకూ వెయిట్ చేయాలి అంటూ రాజమౌళి రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్‌కు గ్లోబల్ ట్రాటర్(GlobeTrotter) అనే హ్యాష్ ట్యాగ్‌ని రాజమౌళి జోడించారు. మూవీలో హీరో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే ఒక సాహస ట్రావెలర్ అని పరోక్షంగా జక్కన్న చెప్పినట్లు అనిపిస్తుంది. ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
ఈ సినిమా షూటింగ్‌ని మేము ఇటీవలే ప్రారంభించాం. దీని గురించి మీరంతా చూపిస్తే ఇంట్రెస్ట్ మాకు కూడా ఆనందం కలిగిస్తుంది. ఈ సినిమా చాలా భారీస్థాయిలో ఉండబోతుంది. కేవలం ప్రెస్‌మీట్ పెట్టి లేదా కొన్ని ఇమేజ్‌లు విడుదల చేయడం వల్ల స్టోరీకి పూర్తిస్థాయిలో మేము న్యాయం చేయలేం. దీన్ని భారీఎత్తున రూపొందిస్తున్నాం అన్నది మాత్రం చెప్పగలను. నవంబర్ 2025లో మహేశ్ లుక్‌ను విడుదల చేస్తాం. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా మాత్రం ఇది ఉంటుంది. మీరంతా సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అంటూ రాజమౌళి పోస్ట్ పెట్టారు.
నిజానికి మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా రాజమౌళీ ఈ సినిమాకు సంబంధించి కచ్చితంగా భారీ అప్డేట్ ఇస్తారని..కనీసం సినిమాలో ఆయన పాత్ర లుక్ ఫోటో యైన విడుదల చేస్తారని అభిమానులు భావించారు. తీరా కేవలం సగం ఫోటోతో కూడిన మహేశ్ బాబు ఫోటోను మాత్రమే రాజమాళి రిలీజ్ చేయడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పిన ఫ్యాన్స్‌కి సెలబ్రెటీలకి మహేష్ బాబు ఎక్స్ వేదికగా థాంక్స్ చెప్పారు. బర్త్ డే సందర్భంగా ఎస్ఎస్ఎంబీ మూవీ నుంచి అప్‌డేట్ కావాలని అందరూ అడుగుతున్నారని తన పోస్టులో పేర్కొన్నారు. రాజమౌళి సినిమాలో నా లుక్ కోసం నేను కూడా మీలాగే ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నానని..నవంబర్‌లో మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తా” అంటూ పోస్ట్ పెట్టారు మహేష్. అయితే ఫ్యాన్స్ మాత్రం తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతిస్పందిస్తున్నారు.
మహేశ్ -రాజమౌళి సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ పార్ వరల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. అటవీ నేపథ్యంలో ఈ సినిమా సాహసాల కథాంశంతో రూపుదిద్దుకుంటుంది. ఇందులో గ్లోబల్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ ‘సలార్’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తమిళ హీరో మాధవన్ నటిస్తున్నారు.
Read more : మహేశ్ బాబు ‘అతడు’ సినిమా రీరిలీజ్ లో ఫ్యాన్స్ సందడి
భారత్‌పై ట్రంప్ 50% సుంకాల మోత – అమెరికా మాజీ మంత్రి తీవ్ర విమర్శ