Sudhakar|డిప్యూటీ సీఎం అయ్యాక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఫోన్ చేస్తే అలా అన్నారు: సుధాక‌ర్

Sudhakar| క‌మెడీయ‌న్ సుధాక‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టుడిగా, విల‌న్‌గా, క‌మెడీయ‌న్‌గా స‌త్తా చాటారు. ఇటీవల కాలంలో ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు. ఇండ‌స్ట్రీకి దూర‌మైన సుధాక‌ర్‌కి సంబంధించి సోష‌ల్ మీడియా

  • By: sn    cinema    Aug 15, 2024 6:58 AM IST
Sudhakar|డిప్యూటీ సీఎం అయ్యాక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఫోన్ చేస్తే అలా అన్నారు: సుధాక‌ర్

Sudhakar| క‌మెడీయ‌న్ సుధాక‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టుడిగా, విల‌న్‌గా, క‌మెడీయ‌న్‌గా స‌త్తా చాటారు. ఇటీవల కాలంలో ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు. ఇండ‌స్ట్రీకి దూర‌మైన సుధాక‌ర్‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. సుధాకర్ మరణించారు అంటూ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వార్తలు హ‌ల్‌చ‌ల్ చేయ‌డం మ‌నం చూశాం. అయితే వాటిపై సోష‌ల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను బ్ర‌తికే ఉన్నాన‌ని అన్నారు. అయితే ఇప్పుడు సుధాక‌ర్ సినిమాలలోకి రాక‌పోవ‌చ్చు కాని ఆయ‌న కుమారుడిని మాత్రం తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తన కుమారుడు బెన్నీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఈయన కూడా పలు బుల్లితెర కార్యక్రమాలకు అలాగే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుధాకర్ ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ నన్ను అన్నయ్య అని పిలిచేవారని నా భార్యను వదిన అని పిలిచేవారని పవన్ ఎంతో ఆప్యాయతతో మాట్లాడేవారని అన్నారు. ఇక నాకు చిరంజీవి ఎంతో పవన్ కళ్యాణ్ కూడా అంతేనని సుధాకర్ తెలిపారు.ఇక ఆయన ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించి డిప్యూటీ సీఎం అయిన తర్వాత తాను ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పానని ఆ సమయంలో పవన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని సుధాకర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి

పవన్, సుధాకర్ లు గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి లో కలిసి నటించ‌గా ఆ చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. ఆ మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించాయి అని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి సుధాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం అందరకి తెలిసిందే. చాలా బ‌క్క చిక్కి నీర‌సంగా క‌నిపిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు 600 సినిమాల దాకా చేసాడు. కొన్ని సినిమాలని కూడా నిర్మించాడు. తెలుగులో ఆయన పండించిన హాస్య నటనకి థియేటర్స్ మొత్తం నవ్వులతో దద్దరిల్లిపోయాయి.తనకి మాత్రమే సాధ్యమయ్యే డైలాగ్ డెలివరీ తో తెలుగు సినిమా పుస్తకంలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ ని ఏర్పాటు చేసుకున్నాడు. త‌మిళంలో కూడా ఆయ‌న‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.