కొన్ని సమస్యలతో బాధపడుతున్న… లావణ్యా త్రిపాఠీ

విధాత:కొంతకాలంగా కాంక్రీట్‌ జంగిల్‌కి దూరంగా ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు లావణ్యా త్రిపాఠీ. ఒత్తిళ్లకు దూరంగా ఆహ్లాదకర జీవితాన్ని చూస్తున్నానని చెబుతున్నారీ డెహ్రాడూన్‌ బ్యూటీ. ప్రస్తుతం ఆమె ట్రిపోఫోబియాతో బాధపడుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు ‘‘లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యాను. ఈ సమయంలో కథలు వింటూ గడిపాను. ‘మనం సంతోషంగా లేనప్పుడు ఎదుటి వారికి ఆనందాన్ని పంచలేము అనే సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను. మన వ్యక్తిగత జీవితంలో ఏం […]

కొన్ని సమస్యలతో బాధపడుతున్న… లావణ్యా త్రిపాఠీ

విధాత:కొంతకాలంగా కాంక్రీట్‌ జంగిల్‌కి దూరంగా ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు లావణ్యా త్రిపాఠీ. ఒత్తిళ్లకు దూరంగా ఆహ్లాదకర జీవితాన్ని చూస్తున్నానని చెబుతున్నారీ డెహ్రాడూన్‌ బ్యూటీ. ప్రస్తుతం ఆమె ట్రిపోఫోబియాతో బాధపడుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు ‘‘లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యాను. ఈ సమయంలో కథలు వింటూ గడిపాను. ‘మనం సంతోషంగా లేనప్పుడు ఎదుటి వారికి ఆనందాన్ని పంచలేము అనే సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను.

మన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందనేది అప్పడప్పుడూ కాస్త చూసుకుంటూ ఉండాలి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మన జీవన శైలి సజావుగా సాగుతుంది. నాకు ట్రిపోఫోబియా ఉంది. కొన్ని ఆకారాలను, వస్తువులను చూేస్త తెలియకుండానే నాలో భయం పుడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను’’ అని తెలిపారు. తెలుగులో తన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’ విడుదలై తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా పోస్టర్‌ షేర్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ చిత్రంలో మిథున పాత్ర తీసుకొచ్చిన గుర్తింపుతోనే తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడ్డానని తెలిపారు.