Taapsee Pannu| పెళ్లి చేసుకున్న విష‌య‌మే మ‌రిచిపోయిన తాప్సీ.. తాళి క‌ట్టినోడి ప‌రిస్థితి ఏంటి?

Taapsee Pannu| బాలీవుడ్ ముద్దుగుమ్మ తాప్సీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టాలీవుడ్‌లో వ‌చ్చిన ఝుమ్మంది నాదం చిత్రంతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్క‌డ వైవిధ్య‌మైన చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తాప్సీ చేసిన లేడి ఓరి

  • By: sn    cinema    Jul 27, 2024 7:02 AM IST
Taapsee Pannu| పెళ్లి చేసుకున్న విష‌య‌మే మ‌రిచిపోయిన తాప్సీ.. తాళి క‌ట్టినోడి ప‌రిస్థితి ఏంటి?

Taapsee Pannu| బాలీవుడ్ ముద్దుగుమ్మ తాప్సీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. టాలీవుడ్‌లో వ‌చ్చిన ఝుమ్మంది నాదం చిత్రంతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్క‌డ వైవిధ్య‌మైన చిత్రాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తాప్సీ చేసిన లేడి ఓరియెంటెడ్ చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో తాప్సీ చేసిన ఝుమ్మంది నాదం ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకోగా, విష్ణుకు జంటగా వస్తాడు నా రాజు టైటిల్ తో ఓ మూవీ చేసింది. ఇది డిజాస్టర్ అని చెప్పాలి. అనూహ్యంగా ప్రభాస్ మూవీ మిస్టర్ పర్ఫెక్ట్ లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఇది తాప్సీకి తొలి హిట్. ఆ త‌ర్వాత మొగుడు, వీర, దరువు, గుండెల్లో గోదావరి చిత్రాల్లో నటించింది.

సౌత్‌లో క‌న్నా నార్త్‌లోనే తాప్సీ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. అయితే తాప్సీ డెన్మార్క్ కి చెందిన మథియాస్ బోయే అనే బాడ్మింటన్ ప్లేయర్ తో దాదాపు 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉంది. వీరి రిలేష‌న్ గురించి మేట‌ర్ ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డ‌కుండా చాలా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇక పెళ్లి కూడా చాలా నిరాడంబరంగా చేసుకున్నారు. తాప్సీ 2024 మార్చిలో మథియాస్ బోయేని ప్రేమ వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. ఇక పెళ్లైన త‌ర్వాత కూడా తాప్సీ సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె న‌టించిన తాజా చిత్రం ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా విడుదలకు సిద్ధం అవుతుంది. ఆగస్టు 9న ఈ మూవీ థియేటర్స్ లోకి రానుండ‌గా, ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో తాప్సీ యాక్టివ్‌గా పాల్గొంటుంది.

రీసెంట్‌గా జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఓ మీడియా ప్రతినిధి తాప్సీ కి కంగ్రాట్స్ చెప్పాడు. దాంతో ఇంకా నా మూవీ విడుదల కాలేదు. హిట్ కాలేదు. అప్పుడే కంగ్రాట్స్ ఎందుకు చెప్పారు అని తాప్సీ అన్న‌ది. దానికి ఆ మీడియా ప్ర‌తినిధి మీరు పెళ్లి చేసుకున్నందుకు కంగ్రాట్స్ చెప్పానని అన్నాడు. అప్పుడు తాప్సీ నాకు పెళ్ళైన విషయం గుర్తే లేదు. మర్చిపోయానని తాప్సీ అనడంతో అంద‌రు షాక్ అయ్యారు. పెళ్లే గుర్తు లేకపోతే కట్టుకున్న భర్త ఏం గుర్తుంటాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.