క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న సినిమాలు తెలుగులో విడుద‌లై భారీ విజ‌యాలు కూడా సాధించాయి. ఈ క్ర‌మంలో ఉపేంద్ర‌కి తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఉపేంద్ర దాదాపు ఏడేళ్లు గ్యాప్‌ తీసుకొని ‘UI’ అనే సినిమా చేస్తున్నారు . మనోహరన్- శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. కాంతర ఫేమ్‌ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది సినిమాపై అంచ‌నాలు పెంచింది. అయితే ఉపేంద్ర న‌టించిన సినిమా టైటిల్స్ చూస్తే ప్ర‌తీది కూడా కొంత భిన్నంగా ఉంటుంది.

ఉపేంద్ర సినిమాల లిస్టు చూస్తే ఓం, ఉష్, స్వస్తిక్,A, ఉపేంద్ర, సూపర్ వంటి చిత్రాలు మంచి విజ‌యాలు సాధించాయి.అయితే ఈ చిత్రాలు ఉపేంద్ర సొంత దర్శకత్వంలో తెరకెక్కినవే. సొంతగా దర్శకత్వం చేసిన సినిమాలకు మాత్రమే ఉపేంద్ర ఇలా వెరైటీ టైటిల్స్ పెడ‌తాడు ఉపేంద్ర‌.అయితే ఇలా వెరైటీ టైటిల్స్ పెట్ట‌డం వెన‌క ఉపేంద్ర ఓ సంద‌ర్భంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. తాను తెర‌కెక్కించిన రెండో సినిమాలో చిన్న హీరో కుమార్ గోవింద్ న‌టించాడు. అయితే ఈ మూవీ బ‌డ్జెట్ కూడా చాలా త‌క్కువ కావ‌డంతో సినిమా ప్ర‌మోష‌న్ కోసం వెరైటీగా ఆలోచించాడు. అందుకే ఆ మూవీకి ఉష్ అనే టైటిల్ పెట్టాడ‌ట‌. అలా ప్ర‌తి సినిమాకి త‌న‌దైన శైలిలో వెరైటీ టైటిల్స్ పెట్ట‌డం చేశాడు.

ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ ఆయ‌న దర్శకత్వంలో వ‌స్తున్న‌ ఉపేంద్ర తన కొత్త సినిమాకి కూడా UI అనే కొత్త టైటిల్ పెట్టాడు. సినిమా టైటిల్ చూసి అంద‌రు కూడా ఈ మూవీ గురించి ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌మోష‌న్‌లో భాగంగా టీజ‌ర్ వద‌ల‌గా, ఇందులో స్టోరీని మనల్ని ఊహించుకోమని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు డైరెక్టర్. ఈ సినిమాకి గాను తెలుగు వెర్షన్ లో తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట. ఈ సినిమా అనౌన్సమెంట్ తోనే మళ్ళీ తనలోని సృజనాత్మకతని మ‌రోసారి చూపించి అంద‌రు కూడా మూవీ గురించి మాట్లాడుకునేలా చేశాడు ఉపేంద్ర‌. మ‌రి ఈ సినిమా ఎంత స‌క్సెస్ అవ‌వుతుందో చూడాలి.

Updated On 12 Feb 2024 5:08 AM GMT
sn

sn

Next Story