ఓటీటీలోకి వకీల్ సాబ్ మే 7న?
శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన 'వకీల్ సాబ్' ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. దీన్ని అంత త్వరగా ఓటీటీలో ప్రసారం చేయొద్దని అనుకున్నారు. కానీ కోవిడ్ కేసులు అంతకంతకూ పెరిగిపోయి థియేటర్లు మూత పడటంతో ఈ సినిమాను ఓటీటీలో ప్రసారం చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారని ఫిల్మ్‌నగర్‌లో టాక్. వచ్చే నెల అంటే మే 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్‌తో పవర్ స్టార్ పవన్ […]

శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైంది. దీన్ని అంత త్వరగా ఓటీటీలో ప్రసారం చేయొద్దని అనుకున్నారు. కానీ కోవిడ్ కేసులు అంతకంతకూ పెరిగిపోయి థియేటర్లు మూత పడటంతో ఈ సినిమాను ఓటీటీలో ప్రసారం చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారని ఫిల్మ్‌నగర్‌లో టాక్. వచ్చే నెల అంటే మే 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్‌తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇచ్చాడు .