Samantha|స‌మంత‌తో న‌టించొద్ద‌ని బాలీవుడ్ హీరోని హెచ్చ‌రించారా…!

Samantha|అందం, అభిన‌యంతో పాటు మంచి టాలెంట్ ఉన్న న‌టి స‌మంత‌( Samantha). ఈ అమ్మ‌డికి ఇటీవ‌ల ఎన్నో క‌ష్టాలు ఎదుర‌య్యాయి. నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత కొన్నాళ్ల‌కి అత‌ని నుండి విడిపోయి చాలా బాధ‌ప‌డింది. ఆ త‌ర్వాత మ‌యోసైటిస్(Mayositis) వ్యాధి స‌మంత‌ని పూర్తిగా

  • By: sn    cinema    Oct 21, 2024 4:03 PM IST
Samantha|స‌మంత‌తో న‌టించొద్ద‌ని బాలీవుడ్ హీరోని హెచ్చ‌రించారా…!

Samantha|అందం, అభిన‌యంతో పాటు మంచి టాలెంట్ ఉన్న న‌టి స‌మంత‌( Samantha). ఈ అమ్మ‌డికి ఇటీవ‌ల ఎన్నో క‌ష్టాలు ఎదుర‌య్యాయి. నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత కొన్నాళ్ల‌కి అత‌ని నుండి విడిపోయి చాలా బాధ‌ప‌డింది. ఆ త‌ర్వాత మ‌యోసైటిస్(Mayositis) వ్యాధి స‌మంత‌ని పూర్తిగా కుంగిపోయేలా చేసింది. మ‌యోసైటిస్ వ్యాధి వ‌చ్చిన స‌మ‌యంలో స‌మంత సినిమాల‌కి కూడా తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు అడ‌పాద‌డ‌పా ప‌ల‌క‌రిస్తుంది.అయితే ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే సమంత చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. సొంత ప్రొడక్షన్లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను అనౌన్స్ చేసిన ఈ సినిమా ముందుకు వెళుతున్నట్టు ఏమి క‌నిపించ‌డం లేదు.

ఇక స‌మంత‌ ముఖ్య పాత్ర పోషించిన ‘సిటాడెల్’ (Citadel)వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సిరీస్ కూడా సమంత నుండి చేజారి పోవ‌ల్సింది. ఈ సిరీస్ కోసం అడిగినపుడే సమంతకు మయోసైటిల్ వ్యాధి నిర్ధారణ అయింది. అప్పుడు స‌మంత అందులో నటించ‌లేన‌ని అనుకుంద‌ట‌. కాని ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్-డీకే హనీ పాత్రను సమంతే చేయాలని పట్టుబట్టి ఆమె అందుబాటులోకి వచ్చేవరకు ఎదురు చూశార‌ట‌. ఇక వ‌రుణ్ ధావ‌న్ ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్స్‌కి సంబంధించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఈ వెబ్ సిరీస్ ఒప్పుకున్న తరువాత ఇండస్ట్రీకి చెందిన చాలామంది స‌మంత‌తో న‌టించొద్దు అని చెప్పార‌ట‌. ఆమెకు హీరోలకు ఉన్నంత ఇమేజ్ ఉంది. ఆమె ఎవరినైనా నటనలో డామినేట్ చేస్తుంది కాబ‌ట్టి సిరీస్ హిట్ అయితే క్రెడిట్ అంతా సమంతకు వెళ్ళిపోతుంది అది నీ కెరీర్ కు మంచిది కాదు అని హెచ్చరించారట.

బాలీవుడ్ హీరోయిన్నే ఎంచుకోమని చాలా మంది చెప్పారట‌. కానీ రాజ్-డీకే(Raj-DK)లతో పాటు తాను కూడా సమంత అయితేనే ఈ పాత్రకు కరెక్ట్ అని భావించి తననే ఎంచుకున్నట్లు వరుణ్ తాజా ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు. వరుణ్ ఈ సిరీస్‌లో బన్నీ అనే పాత్రలో నటించాడు. ఇందులో వరుణ్-సామ్ సీక్రెట్ ఏంజెంట్లుగా కనిపించనున్నారు.దాదాపు ఏడాదిన్నరగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న సమంత. ఇప్పుడు ఈ సిరిస్ తో మరోసారి సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వబోతోంది. ఈ సిరీస్ త‌ర్వాత స‌మంత‌కి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వ‌చ్చే అవ‌కాశం కూడా లేక‌పోలేదు.