మా ఎలక్షన్ల పై స్పందించిన విక్టరీ వెంకటేశ్
విధాత :‘నారప్ప’ తన కెరీర్‌లోనే సవాల్ విసిరిన పాత్ర అని విక్టరీ వెంకటేశ్ అన్నారు. ఎమోషన్స్, మాస్, యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కోసం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమించానని ఆయన తెలిపారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ప్రస్తుతం వెంకటేశ్ ‘నారప్ప’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘మా’ఎన్నికలు, జరుగుతున్న వివాదాల గురించి ఆయన్ను ప్రశ్నించగా ‘‘ఏదీ మన చేతుల్లో […]

విధాత :‘నారప్ప’ తన కెరీర్‌లోనే సవాల్ విసిరిన పాత్ర అని విక్టరీ వెంకటేశ్ అన్నారు. ఎమోషన్స్, మాస్, యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కోసం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమించానని ఆయన తెలిపారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ప్రస్తుతం వెంకటేశ్ ‘నారప్ప’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ‘మా’ఎన్నికలు, జరుగుతున్న వివాదాల గురించి ఆయన్ను ప్రశ్నించగా ‘‘ఏదీ మన చేతుల్లో లేదు. ఏదైనా జరగొచ్చు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎలక్షన్ల నేపథ్యంలో జరిగే విమర్శలు, మాటల తూటాలు శాశ్వతం కాదు’’ అని సమాధానమిచ్చారు.