Vithika Sheru|నా త‌ల్లితోనే క‌మిట్‌మెంట్ గురించి మాట్లాడారు.. త‌న బాధ చెప్పుకొని ఎమోష‌న‌లైన వితికా

Vithika Sheru| బిగ్ బాస్ షోని ఫాలో అయ్యే వారికి, టాలీవుడ్ సినీ ప్రియుల‌కి వితికా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. భీమవరంలో పుట్టిన ఈమె కన్నడ పరిశ్రమ ద్వారా నటిగా త‌న కెరీర్ మొద‌లు పెట్టింది. 15వ సంవత్సరంలోనే సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన వితికా అంతు ఇంతు ప్రీతి బంతు అనే క

  • By: sn    cinema    May 04, 2024 10:35 AM IST
Vithika Sheru|నా త‌ల్లితోనే క‌మిట్‌మెంట్ గురించి మాట్లాడారు.. త‌న బాధ చెప్పుకొని ఎమోష‌న‌లైన వితికా

Vithika Sheru| బిగ్ బాస్ షోని ఫాలో అయ్యే వారికి, టాలీవుడ్ సినీ ప్రియుల‌కి వితికా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. భీమవరంలో పుట్టిన ఈమె కన్నడ పరిశ్రమ ద్వారా నటిగా త‌న కెరీర్ మొద‌లు పెట్టింది. 15వ సంవత్సరంలోనే సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన వితికా అంతు ఇంతు ప్రీతి బంతు అనే కన్నడ సినిమాతో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఈ చిత్రం ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాకి రీమేక్. ఇందులో త్రిష చెల్లెలిగా చేసిన కలర్స్ స్వాతి పాత్రను ఆమె పోషించింది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో హీరోయిన్ గా కూడా చేసి మెప్పించింది. కెరియర్ పీక్స్ లో ఉండగానే.. హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమంచి పెళ్లి చేసుకుంది వితికా. ఇప్పుడు ఈ జంట సంతోషంగా ఉన్నారు. వారి పెళ్లి అయి కూడా 9 సంవత్సరాలు అవుతోంది.

అయితే వితికా ఇప్పుడు సినిమాల‌కి దూరంగా ఉంటుంది కాని సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటుంది. అలానే ఇంట‌ర్వ్యూలలో గ‌త జ్ఞాపకాలు జ్ఞ‌ప్తికి తెచ్చుకుంటూ హాట్ టాపిక్‌గా మారుతుంది. వితికా తాను 16 ఏళ్ల వయసప్పుడు ఓ తెలుగు సినిమా ఆడిషన్స్ కి వెళ్లగా, అక్క‌డ విచిత్ర ప‌రిస్థితి ఎదురైంద‌ట.అమ్మతో కలిసి ఆడిషన్స్ కి వెళ్లిన‌ప్పుడు త‌న‌ని సెల‌క్ట్ చేశార‌ట‌. అయితే ఆ స‌మ‌యంలో అమ్మ‌తో మాట్లాడాలి బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌ని చెప్పార‌ట‌. నేను బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యంలో మీ కూతురికి ఈ సినిమా ఛాన్స్ రావాలి అంటే నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పార‌ట‌. అమ్మ‌కి అర్ధం కాక న‌న్ను పిలిచింది. లోపలికి వెళ్ళాక.. కమిట్మెంట్ అంటున్నారు నాకు అర్థం కాలేదు నువ్వే మాట్లాడు అని అమ్మ నాతో చెప్పింది.

తనకు మేటర్ అర్ధమయ్యాక ఆ ప్రపోజ‌ల్‌కి నో చెప్పాను. పారితోషికం లేకుండా అయిన చేస్తాను కాని కమిట్మెంట్ మాత్రం ఇవ్వనని తెగేసి చెప్పింద‌ట‌. బాగా తెలిసిన వారే త‌న‌ని క‌మిట్‌మెంట్ అడిగార‌ని చెప్పిన వితికా వారి పేరు మాత్రం రివీల్ చేయ‌లేదు. ఇక ఇప్ప‌టికీ పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణం కూడా చెప్పింది వితికా. 2019 మొదట్లో తాము అమెరికాలో ఆరు నెల‌లు ఉండ‌గా, ఆ స‌మ‌యంలో ప్ర‌గ్నెంట్ అయ్యాను. కాని త‌ర్వాత గ‌ర్భ‌స్రావం జ‌రిగింది. బాధ నుండి బ‌య‌ట‌పడేందుకు ఇండియాకి వ‌చ్చాం. ఇక్క‌డికి వ‌చ్చాక స్కానింగ్ చేయించుకోగా, బేబీ చిన్న ముక్క లోపలే ఉండడంతో.. మరోసారి అబార్షన్ చేసి గర్భ సంచి అంతా క్లీన్ చేశారని చెప్పుకొచ్చింది.