Hero Simbu | టాలీవుడ్‌ హీరోయిన్‌తో కోలీవుడ్‌ స్టార్‌ హీరో శింబు పెళ్లి..! ఈ సారైనా వార్తలు నిజమయ్యేనా..?

Hero Simbu | కోలీవుడ్‌లో శింబు స్టార్‌ నటుడు. గతంలో అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్‌ ఉండేది. తమిళ చిత్రాలు చాలా వరకు తెలుగులో విడుదలయ్యేవి. శింబు సినిమాల గురించి చెప్పాలంటే మన్మధ గురించి ప్రత్యేకంగా పెంచుకోవాల్సిందే. ఈ రొమాంటిక్‌ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నది.

Hero Simbu | టాలీవుడ్‌ హీరోయిన్‌తో కోలీవుడ్‌ స్టార్‌ హీరో శింబు పెళ్లి..! ఈ సారైనా వార్తలు నిజమయ్యేనా..?

Hero Simbu | కోలీవుడ్‌లో శింబు స్టార్‌ నటుడు. గతంలో అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్‌ ఉండేది. తమిళ చిత్రాలు చాలా వరకు తెలుగులో విడుదలయ్యేవి. శింబు సినిమాల గురించి చెప్పాలంటే మన్మధ గురించి ప్రత్యేకంగా పెంచుకోవాల్సిందే. ఈ రొమాంటిక్‌ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తుండగా.. త్వరలోనే విడుదలవనున్నాయి. సినిమాల విషయం పక్కన పెడితే కోలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా గుర్తింపు చేసుకున్నాడు. గతంలో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వచ్చినా.. అందులో నిజం లేదని తేలిపోయింది. ఇటీవల శ్రీలంకకు చెందిన యువతిని మనువాడనున్నాడని.. తండ్రి పెళ్లికి ఏర్పాటు చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా తెలుగు హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.

ఆ తెలుగు బ్యూటీ ఎవరో కాదు నిధి అగర్వాల్‌. ఇందులో ఎంత వరకు నిజమున్నదని తెలియదు కానీ.. వార్తలు మాత్రం వైరల్‌గా మారాయి. ఇద్దరు కలిసి ‘ఈశ్వరన్‌’ మూవీలో నటించారు. ఆ సమయంలోనూ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని.. త్వరలోనే పెళ్లి పీటలకెక్కనున్నారని వార్తలు వచ్చాయి. మళ్లీ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. శింబు గతంలో పలువురు హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడిపాడు. నయనతారతో ఎఫైర్‌ నడుస్తుందని వార్తలు భారీగా వినిపించాయి. ఆ తర్వాత హన్సికతో ప్రేమలో ఉన్నాడని.. శింబుతో పెళ్లికి సైతం రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం శింబు 40 సంవత్సరాలు దాటింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఈ సారి పెళ్లి వార్తలు నిజమవుతాయా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం శింబు రెండుసినిమాల్లో నటిస్తున్నాడు. ఎస్టీఆర్‌ 48, థగ్‌ లైఫ్‌ మూవీల్లో నటిస్తున్నారు.