పట్టాలు తప్పిన రైలు.. నలుగురు ప్రయాణికుల దుర్మరణం..!

విధాత: రైలు ప్రమాదానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల పట్టాలు తప్పడంతో రైళ్లలో పొగలు వస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. ఒడిశా బాలాసోర్ ఘటనలో 200 మందికిపైగా దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. తాజాగా బిహార్ బకర్స్ జిల్లా రఘునాథ్‌పూర్ స్టేషన్‌కు సమీపంలో 12506 డౌన్ నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఐదుకోచ్‌లు పట్టాలు తప్పాయి. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అసోంలోని కామాఖ్యకు వెళ్తున్న సమయంలో బుధవారం రాత్రి 9.35 గంటల ప్రాంతంలో ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది.
సమాచారం మేరకు ఇప్పటి వరకు నలుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను తరలించేందుకు పాట్నా నుంచి స్క్రాచ్ రేక్ పంపినట్లు అధికారులు తెలిపారు. రైలు రైలు ప్రమాదంపై బిహార్ డిప్యూటీ సీఎం విచారం వ్యక్తం చేశారు. సహాయకర్యలు చేపట్టాలని ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే ప్రమాదంపై స్పందించారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ఘటనాస్థలికి పంపించామని, క్షతగాత్రులను పట్నాలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. 9771449971 (పాట్నా), 8905697493 (ధన్‌పూర్), 7759070004 (కమాండ్ కంట్రోల్) 8306182542 (అరా) హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించాలని సూచించింది.