72గంటల్లో దొంగల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

విధాత‌,మచిలీపట్నం :ఈనెల 21న స్థానిక మొబైల్ షాప్ లో జ‌రిగిన చోరీ కేసుని ఛేదించిన పోలీసులు.బుట్టాయిపేట సెంటర్లోని గాయత్రి మొబైల్ షాపులో అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పైకప్పు పగలగొట్టి లోపలికి ప్రవేశించి షాపులో ఉన్న వివిధ కంపెనీలకు చెందిన 32 సెల్ ఫోన్లు, బ్లూటూత్, పవర్ బ్యాంకు, స్క్రీన్ గార్డ్ లు, నెట్ బ్యాండ్ లు, సి.పి.యు మొదలైన 1,58,000 (లక్షా యాభై ఎనిమిది వేల రూపాయలు) విలువగల వస్తువులు చోరీచేశారు. బందరు డి.ఎస్.పి షేక్ మాసుం […]

72గంటల్లో దొంగల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

విధాత‌,మచిలీపట్నం :ఈనెల 21న స్థానిక మొబైల్ షాప్ లో జ‌రిగిన చోరీ కేసుని ఛేదించిన పోలీసులు.బుట్టాయిపేట సెంటర్లోని గాయత్రి మొబైల్ షాపులో అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పైకప్పు పగలగొట్టి లోపలికి ప్రవేశించి షాపులో ఉన్న వివిధ కంపెనీలకు చెందిన 32 సెల్ ఫోన్లు, బ్లూటూత్, పవర్ బ్యాంకు, స్క్రీన్ గార్డ్ లు, నెట్ బ్యాండ్ లు, సి.పి.యు మొదలైన 1,58,000 (లక్షా యాభై ఎనిమిది వేల రూపాయలు) విలువగల వస్తువులు చోరీచేశారు.

బందరు డి.ఎస్.పి షేక్ మాసుం బాషా ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్. పేట పోలీస్ స్టేషన్ సిఐ భీమరాజు కేసు నమోదు చేసి నేర పరిశోధనలో సాంకేతికతను వినియోగించి 72 గంటల్లో ముద్దాయిలను అరెస్టు చేశారు.వారి నుండి చోరీ సొత్తుతో పాటు 2 ద్విచక్ర వాహనాలను కూడా రికవరీ చేసిన సి.ఐ బీమరాజు.

అతితక్కువ సమయంలో కేసుని అత్యంత చాకచక్యంగా ఛేదించినందుకు కృష్ణాజిల్లా ఎస్.పి సిద్దార్డ్ కౌశిల్ అభినందనలు అందుకున్న ఆర్ పేట సి.ఐ భీమరాజు,ఎస్ ఐ భాషా, అనూష క్రైమ్ స్టేషన్ సిబ్బంది, ఐ.టి కోర్ టీం.