సామాజిక మాధ్యమాల్లో ఫేక్ అకౌంట్ ద్వారా పరిచయమై అమ్మాయిలను వంచిస్తున్న యువకుడు అరెస్టు
కిలో గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం విధాత:ఫేస్ బుక్,టిండర్ యాప్, తెలుగు మాట్రిమోనిలలో ఫేక్ అకౌంట్ సృష్టించి అమ్మాయిలను పరిచయం చేసుకుని ఆ తర్వాత వంచనలకు పాల్పడుతున్న యువకుడిని అనంతపురం దిశ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుండీ కిలో గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గురువారం జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇతను బిటెక్ మూడవ సంవత్సరం […]

కిలో గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం
విధాత:ఫేస్ బుక్,టిండర్ యాప్, తెలుగు మాట్రిమోనిలలో ఫేక్ అకౌంట్ సృష్టించి అమ్మాయిలను పరిచయం చేసుకుని ఆ తర్వాత వంచనలకు పాల్పడుతున్న యువకుడిని అనంతపురం దిశ పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుండీ కిలో గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గురువారం జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఇతను బిటెక్ మూడవ సంవత్సరం వరకు చదివి ఆతర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తీ చేశాడు. పైగా వ్యసనపరుడు. క్రికెట్ బెట్టింగ్ , పేకాటలకు బానిసయ్యాడు. ఈనేపథ్యంలో సరిపడా సంపాదన, డబ్బు లేకపోవడంతో నూతన పంథా ఎంచుకున్నాడు. అమ్మాయిలను వంచించి డబ్బు సంపాదించాలని భావించాడు. ఇందులో భాగంగానే అమ్మాయిలతో ఫోన్లలో సంభాషించి దగ్గరవడం లాంటి పనులు చేయడంతో పాటు ఫేస్ బుక్ , టిండర్ యాప్ , తెలుగు మాట్రిమోనిలలో ఫేక్ ఐ.డి తో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు. సిద్ధార్థ రెడ్డి పేరున ఫేక్ అకౌంట్ సృష్టించుకున్నాడు.
అందమైన వ్యక్తి ఫోటోను ఫేస్ బుక్ లో డౌన్లోడ్ చేసుకుని అదే ఫోటోను తన ప్రొఫైల్ పిక్ గా ఉంచుకున్నాడు. ఈ ఫేక్ అకౌంట్ ద్వారా అమ్మాయిలతో పరిచయమై నిరంతరం వాట్సాప్ చాటింగులు/వాయిస్ కాల్స్ కొనసాగించేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చాటింగ్ , వాయిస్ కాల్స్ ద్వారా కొందరు అమ్మాయిలను నమ్మించాడు. మరి కొందరి అమ్మాయిలలో లైంగిక వాంఛ పెరిగేలా ప్రేరేపించడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆతర్వాత వారి నుండీ నగ్న దృశ్యాలు రికార్డ్ చేయించుకుని ఆ ఫోటోలు/వీడియోలను తన మొబైల్ కు తెప్పించుకున్నాడు. ఆ వీడియోలతో పైశాచిక ఆనందం పొందేవాడు. వీటితోపాటు తెలుగు మాట్రిమోని ద్వారా కూడా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి యువతులను వంచించాడు. ఇలా… ఫేస్ బుక్ , టిండర్ యాప్ , తెలుగు మాట్రిమోనిల ద్వారా హైదరాబాద్ , బెంగుళూరు, తిరుపతి, విజయవాడ, ప్రొద్దటూరు, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాలకు చెందిన యువతులను మోసం చేశాడు. సూమారు రూ. 5 లక్షల వరకు అమ్మాయిల నుండీ తన బ్యాంకు అకౌంట్లు, ఫోన్ పే , గూగుల్ పేలకు వేయించుకున్నాడు. సుమారు 15 మంది నుండి 20 వరకు అమ్మాయిలు బాధితులుగా ఉన్నారు. అందునా ఉన్నత చదువరులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఇతని వంచనకు గురయ్యారు. అంతేకాకుండా … అమ్మాయిలు/మహిళలు స్నానం చేసే సమయాలలో దొంగ చాటుగా వెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరించాడు. అంతేకాకుండా ఇతను గంజాయి విక్రయానికి పూనుకున్నాడు. తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించే వాడు. ఇతనిపై ఇప్పటికే అనంతపురం ఒన్ టౌన్ , టూటౌన్ పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి.
ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి
జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు
మహిళలపై జరిగే సైబర్ నేరాలు మరియు మహిళల సంరక్షణ కోసం అధిక ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో ఫేక్ ఐ.డి లతో ఫేక్ అకౌంట్లు సృష్టించి అమ్మాయిలను వంచించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్ చాటింగ్ లు/ వాయిస్ కాల్స్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయరాదన్నారు. టి.భరత్ రెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే దిశ డీఎస్పీ ఏ.శ్రీనివాసులను సంప్రదించాలని తెలియజేశారు.
** అమ్మాయిలు/మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
సామాజిక మాధ్యమాలలో ముఖ్యమైన వ్యక్తిగత ఫోటోలు గానీ వీడియోలు గానీ షేర్ చేయకండి
- ప్రైవసీ సెట్టింగ్స్ ను యాక్టివ్ చేయాలి
- మాట్రిమోని వెబ్ సైట్ లలో పరిచయాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
- మహిళల చేతిలో వజ్రాయుధమైన దిశ SOS యాప్ ను ప్రతీ ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని సేవలు వినియోగించుకోవాలి.
అరెస్టు వివరాలు:టి. భరత్ రెడ్డి, వయస్సు 30 సం., బైరవనగర్ , అనంతపురం