శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు-కారు ఢీ
విధాత,కర్నూలు: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి వస్తున్న కారు.. శ్రీశైలం నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిన్న ఆరుట్ల సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప జిల్లా పులివెందులకు చెందిన గంగాభవాని, ఆది నారాయణరెడ్డి, సుగుణ, శారద, అశోక్‌రెడ్డిగా గుర్తించారు. వీరంతా బంధువుల పెళ్లికి హాజరైన అనంతరం శ్రీశైలం దర్శనానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం […]

విధాత,కర్నూలు: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి వస్తున్న కారు.. శ్రీశైలం నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిన్న ఆరుట్ల సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప జిల్లా పులివెందులకు చెందిన గంగాభవాని, ఆది నారాయణరెడ్డి, సుగుణ, శారద, అశోక్‌రెడ్డిగా గుర్తించారు. వీరంతా బంధువుల పెళ్లికి హాజరైన అనంతరం శ్రీశైలం దర్శనానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులను సున్నిపెంటలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.