సంగారెడ్డి: అమీన్‌పూర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

విధాత: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్‌ దాదాపు 17 రోజులుగా హల్‌చల్‌ సృష్టిస్తోంది. వరుసగా రెండు రోజులు వేర్వేరు కాలనీల్లో మారణాయుధాలతో చెడ్డీగ్యాంగ్ తిరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 5న బృందావన్‌ టీచర్స్‌ కాలనీలోని విల్లా నంబర్ 18లో 12 తులాల బంగారం చోరీకి గురైంది. దీంతో పోలీసులు సీసీ ఫుటేజ్‌ పరిశీలించగా, నలుగురు దొంగలు చెడ్డీలతో తిరుగుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. అలాగే ఈ నెల 17న రెయిన్‌బో కాలనీలో నలుగురు […]

  • By: krs    crime    Sep 18, 2022 3:49 PM IST
సంగారెడ్డి: అమీన్‌పూర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

విధాత: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్‌ దాదాపు 17 రోజులుగా హల్‌చల్‌ సృష్టిస్తోంది. వరుసగా రెండు రోజులు వేర్వేరు కాలనీల్లో మారణాయుధాలతో చెడ్డీగ్యాంగ్ తిరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ నెల 5న బృందావన్‌ టీచర్స్‌ కాలనీలోని విల్లా నంబర్ 18లో 12 తులాల బంగారం చోరీకి గురైంది. దీంతో పోలీసులు సీసీ ఫుటేజ్‌ పరిశీలించగా, నలుగురు దొంగలు చెడ్డీలతో తిరుగుతున్న దృశ్యాలు బయటపడ్డాయి.

అలాగే ఈ నెల 17న రెయిన్‌బో కాలనీలో నలుగురు దొంగలు తిరుగుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.