37 లక్షల రూపాయలు మోసం చేసిన సైబర్ చీటర్స్..

విధాత‌: దేశంలో సైబ‌ర్ నేరాలు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి.పోలీసులు ఎన్ని జాగ్ర‌త్త సూచ‌న‌లు చెప్పినా ప్ర‌జ‌లు సైబ‌ర్ కేటుగాళ్ల వ‌లలో చిక్కుతున్నారు.సైబ‌ర్ నేరాల‌కు అత్యాశే కార‌ణం అని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో దేశంలో సైబ‌ర్ నేరాల సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతుంది, అయితే తాజాగా 37 లక్షల రూపాయలు మోసం చేసిన సైబ‌ర్ కేటుగాళ్లు. ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇస్తామని ఇద్దరు వ్యక్తుల నుండి 3.7 లక్షల మోసం చేశార‌ని […]

37 లక్షల రూపాయలు మోసం చేసిన సైబర్ చీటర్స్..

విధాత‌: దేశంలో సైబ‌ర్ నేరాలు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి.పోలీసులు ఎన్ని జాగ్ర‌త్త సూచ‌న‌లు చెప్పినా ప్ర‌జ‌లు సైబ‌ర్ కేటుగాళ్ల వ‌లలో చిక్కుతున్నారు.సైబ‌ర్ నేరాల‌కు అత్యాశే కార‌ణం అని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో దేశంలో సైబ‌ర్ నేరాల సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతుంది, అయితే తాజాగా 37 లక్షల రూపాయలు మోసం చేసిన సైబ‌ర్ కేటుగాళ్లు.

ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇస్తామని ఇద్దరు వ్యక్తుల నుండి 3.7 లక్షల మోసం చేశార‌ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.గిఫ్ట్ పేరుతో ఓ మహిళ నుండి 16 లక్షల మోసం చేయ‌గా పోలీసులు నైజీరియన్ ను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ బోయిన్ పల్లి కి ఓ మహిళకు విలువైన బహుమతి వచ్చిందని కాల్ చేయ‌గా అందుకుగాను వివిధ చార్జీల పేరుతో 16 లక్షలు మోసపోయిన మహిళ గతంలో సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది ఈ కేసులో ఢిల్లీలో మైకేల్ అనే నైజీరియన్ ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.

లాటరీలో విలువైన కారు గెలుపొందారని 17.35 లక్షల మోసం.హైదరాబాద్ గోల్కొండ కు చెందిన అబ్దుల్ ముజీబ్ ఖాన్ కు విలువైన కార్ గెలిచారంటూ కాల్ చేసిన సైబర్ చీటర్స్కార్ కావాలా, క్యాష్ కావాలా అడగగా నగదు కావాలని అడిగిన బాధితుడు, ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే వివిధ చార్జీలు కట్టాలని. ఆన్లైన్ ద్వారా 17.35 లక్షలు కాజేసిన చీటర్స్ దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.