క‌రోనాతో మహిళా కానిస్టేబుల్ మృతి

తోట్ల వల్లూరు: ఎనిమిది నెల‌ల క్రితం వివాహం.. ఆరు నెల‌ల గ‌ర్భిణి క‌రోనా బారిన ప‌డి చ‌నిపోయింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. చల్లపల్లి మండల, కొడాలి గ్రామానికి చెందిన కోమలి తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. ఎనిమిది నెల‌ల క్రితం ఈమెకు వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఆరు నెల‌ల క‌డుపుతో ఉంది. ఈ నెల‌ 8 వ తేదీ కొవిడ్ సోకి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను 13వ తేదీ […]

క‌రోనాతో మహిళా కానిస్టేబుల్ మృతి

తోట్ల వల్లూరు: ఎనిమిది నెల‌ల క్రితం వివాహం.. ఆరు నెల‌ల గ‌ర్భిణి క‌రోనా బారిన ప‌డి చ‌నిపోయింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. చల్లపల్లి మండల, కొడాలి గ్రామానికి చెందిన కోమలి తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. ఎనిమిది నెల‌ల క్రితం ఈమెకు వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఆరు నెల‌ల క‌డుపుతో ఉంది.

ఈ నెల‌ 8 వ తేదీ కొవిడ్ సోకి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను 13వ తేదీ టైమ్ హాస్పటల్ లో జాయిన్ చేశారు. క‌రోనాతో పోరాడుతూ శ‌నివారం క‌న్నుమూసింది. డీసీపీ హర్షవర్ధన్ రాజు, సిఐ నాగప్రసాద్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించి కోమ‌లి బంధువుల‌ను ప‌రామ‌ర్శించారు. ఇదిలా ఉండ‌గా తోట్ల వల్లూరు ఎస్సై కిషోర్ బాబు క‌రోనా బారిన ప‌డి చికిత్స పొందుతున్నారు. దీంతో సిబ్బంది ఆందోళ‌న చెందుతున్నారు.