ఘరానా దొంగలు అరెస్ట్
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్టు -విజయనగరం డిఎస్పీ అనిల్ కుమార్ పులిపాటి విధాత:విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు జువిన తో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు విజయగనరం డిఎస్పీ పి.అనిల్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయాలైన తాశీల్దార్, ఎంపిడిఓ మరియు పాఠశాలల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు ఎవరో గుర్తు […]

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్టు –విజయనగరం డిఎస్పీ అనిల్ కుమార్ పులిపాటి
విధాత:విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు జువిన తో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు విజయగనరం డిఎస్పీ పి.అనిల్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయాలైన తాశీల్దార్, ఎంపిడిఓ మరియు పాఠశాలల్లో కంప్యూటర్లు, ప్రింటర్లు ఎవరో గుర్తు తెలియని దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లుగా వచ్చిన ఫిర్యాదుల పై నెల్లిమర్ల పోలీసులు మూడు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కేసుల దర్యాప్తులో భాగంగా నెల్లిమర్ల పోలీసులకు వచ్చిన సమాచారం పై ఓఎల్ఎక్స్ లో ఒక మొబైల్ ఫోను విక్రయించిన వ్యక్తి పై నిఘా పెట్టారు. సదరు వ్యక్తిని విచారించగా,తాను మరో వ్యక్తి నుండి ఫోనును కొనుగోలు చేసి, ఓఎల్ఎక్స్ లో పెట్టి విక్రయించినట్లుగా అంగీకరించడంతో విజయ
నగరం పట్టణం పూల్ బాగ్ కు చెందిన తుపాకుల సాయికుమార్ అనే నిందితుడ్ని అదుపులోకి తీసుకొని, విచారించారు.నిందితుడి పై విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనులో హిస్టరీ షీటు వుండడం, చెడు వ్యసనాలకు లోనై, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని, కంప్యూటర్లు, ప్రింటర్లు, సిపియూలు, ట్యాబ్ లను దొంగిలించినట్లుగా అంగీకరించాడు. దొంగిలించిన వస్తువులను మరో ఇద్దరు జువినల్స్ సహకారంతో ఒఎల్ ఎక్స్ లో పెట్టి, అమ్మకాలు సాగించి, వచ్చిన డబ్బులను పంచుకోవడం, విలాసాలకు వినియోగించేవారన్నారు. నిందితుడు తుపాకుల సాయి వద్ద
నుండి మూడు కంప్యూటరు మోనిటర్లు, రెండు సిపియూలు, మూడు ప్రింటర్లు, ఒక ట్యాబును స్వాధీనం చేసుకొని,నిందితుడ్ని రిమాండుకు తరలించామన్నారు. అదే విధంగా ఈ కేసుల్లో అరెస్టు కాబడిన ఇద్దరు జువినల్స్ ను జువినల్ కోర్టుకు తరలించామని డిఎస్పీ పి. అనిల్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ మూడు కేసులను చేధించడంలో క్రియా శీలకంగా పాత్ర పోషించిన రూరల్ సిఐ టిఎస్ మంగవేణి, నెల్లిమర్ల ఎస్ఐ రవీంద్రరాజు, సిబ్బందిని అభినందించారు.
విజయనగరం డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం డిఎస్పీ పి. అనిల్ కుమార్,రూరల్ సిఐ టిఎస్ మంగవేణి,నెల్లిమర్ల ఎస్ఐ రవీంద్రరాజు పాల్గొన్నారు.