రిటైర్డ్ డిజిపి వినయ్ రంజన్ ఇంటికే కన్నం
విధాత,హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.10(సీ)లోని ప్లజెంట్ వ్యాలీలో నివసించే రిటైర్డ్ డీజీపీ రాయ్ వినయ్ రంజన్(62) ఇంట్లో రూ.5 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పనిచేస్తున్న సీపీఎల్ హెడ్ కానిస్టేబుల్ ప్రభుదాస్, పనిమనిషి కుమారిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. తన బెడ్‌రూమ్‌లో బ్రీఫ్‌కేస్‌లో రూ.2 వేల నోట్లు, రూ.500 నోట్లతో రూ.5 లక్షల నగదు పెట్టడం జరిగిందని, ఈ నెల […]

విధాత,హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.10(సీ)లోని ప్లజెంట్ వ్యాలీలో నివసించే రిటైర్డ్ డీజీపీ రాయ్ వినయ్ రంజన్(62) ఇంట్లో రూ.5 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో పనిచేస్తున్న సీపీఎల్ హెడ్ కానిస్టేబుల్ ప్రభుదాస్, పనిమనిషి కుమారిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. తన బెడ్‌రూమ్‌లో బ్రీఫ్‌కేస్‌లో రూ.2 వేల నోట్లు, రూ.500 నోట్లతో రూ.5 లక్షల నగదు పెట్టడం జరిగిందని, ఈ నెల 4వ తేదీన ఈ చోరీ జరిగిందని ఆయన తెలిపారు.