కూకట్ పల్లి సంగీత్ నగర్ లో విషాదం

విధాత,హైదరాబాద్ కూకట్ పల్లి సంగీత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. గేమ్ ఆడుతుండగా తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నారని 12ఏళ్ల బాలుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడు మొబైల్ ఫోన్ కు బానిసగా మారాడు. తరుచుగా గేమ్స్ ఆడుతున్నాడు. నిత్యం ఫోన్ లోనే మునిగిపోవడంతో తల్లిదండ్రులు కోప్పడ్డారు. బాలుడి నుంచి ఫోన్ లాక్కున్నారు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఊహించని పరిణామంతో తల్లిదండ్రులు విస్మయం చెందారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఫోన్ […]

కూకట్ పల్లి సంగీత్ నగర్ లో విషాదం

విధాత,హైదరాబాద్ కూకట్ పల్లి సంగీత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. గేమ్ ఆడుతుండగా తల్లిదండ్రులు ఫోన్ లాక్కున్నారని 12ఏళ్ల బాలుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడు మొబైల్ ఫోన్ కు బానిసగా మారాడు. తరుచుగా గేమ్స్ ఆడుతున్నాడు. నిత్యం ఫోన్ లోనే మునిగిపోవడంతో తల్లిదండ్రులు కోప్పడ్డారు.

బాలుడి నుంచి ఫోన్ లాక్కున్నారు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఊహించని పరిణామంతో తల్లిదండ్రులు విస్మయం చెందారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఫోన్ లాక్కున్నారని బాలుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చకు దారితీసింది. చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సి వయసులో పిల్లలు తీసుకుంటున్న నిర్ణయాలు, వారి విపరీత ప్రవర్తన తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లలు అడగ్గానే తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. వారు వాటితో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనేది మాత్రం తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. తల్లిదండ్రులు అది గ్రహించే సమయానికి చాలా ఆలస్యం అవుతోంది.