భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

అమరావతి: కాలం మారింది..భార్యల పట్ల కాలయముడులైన భర్తల వార్తలు రివర్స్ అయ్యాయి. ఇటీవల భర్తలను కిరాతకంగా చంపుతున్న భార్యల కథనాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. భార్య చేతుల్ల హతమైన భర్తల వార్తలు సాధారణంగా మారిపోయాయి. ఈ క్రమంలో ఓ భార్య తన భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన వైనం సంచలనంగా మారింది. ఏపీలోని నూనెపల్లికి చెందిన రమణయ్య(50)తో పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20ఏళ్ల క్రితం పెళ్లెంది. భార్య భర్తల మధ్య తరుచు గొడవలు రేగడంలో కొంతకాలంగా రమణమ్మ తన పుట్టింట్లో ఉంటోంది.
ఆమెను కాపురానికి తీసుకెళ్లేందుకు భర్త రమణయ్య ఆమె పుట్టింటికి వెళ్లాడు. ఈ సందర్భంగా భార్య కుటుంబీకులతో అతనికి ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో భార్య, ఆమె తమ్ముడు కలిసి రమణయ్య కళ్లల్లో కారం చల్లి దాడి చేయడంతో చనిపోయాడు. హత్య అనంతరం భర్త మృతదేహాన్ని నంద్యాలకు తీసుకొచ్చి అతని ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.