క్షణికావేశంలో వివాహిత‌ ఆత్మహత్య

విధాత‌: చెట్టుకి ఉరివేసుకొని వివాహిత‌ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌ణ అనంతపురం జిల్లా,ఏకపాదంపల్లి మండ‌లం తాడిమర్రిలో జ‌ర‌గింది. పోలీసుత క‌థ‌నం మేర‌కు గ్రామానికి చెందిన వెంక‌ట న‌ర్సింహులు,మాల్య‌వంతా గ్ర‌మినికి చెందిన పుష్ప (23) మూడేళ్ల క్రితం ప్రేమ‌వివాహం చేసుకున్నారు వీరికి దివ్య‌,దేవాన్ష్ అనే క‌వ‌ల‌లు జ‌న్మించారు. వెంక‌ట న‌ర్సింహులు ప్రైవేట్ డ్రైవ‌ర్ గా ప‌ని చేసేవాడు.సోమ‌వారం ప‌నికి వెళ్లి వ‌చ్చాకా భార్య,భ‌ర్త‌లిద్ద‌రూ గొడవ‌ప‌డ్డారు.దీంతో పుష్ప పిల్ల‌ల‌ను తీసుకొని చ‌నిపోతాన‌ని ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్ల‌గా గ్రామ‌స్తులు న‌చ్చ‌జెప్పి పంపారు.ఆ […]

క్షణికావేశంలో వివాహిత‌ ఆత్మహత్య

విధాత‌: చెట్టుకి ఉరివేసుకొని వివాహిత‌ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌ణ అనంతపురం జిల్లా,ఏకపాదంపల్లి మండ‌లం తాడిమర్రిలో జ‌ర‌గింది. పోలీసుత క‌థ‌నం మేర‌కు గ్రామానికి చెందిన వెంక‌ట న‌ర్సింహులు,మాల్య‌వంతా గ్ర‌మినికి చెందిన పుష్ప (23) మూడేళ్ల క్రితం ప్రేమ‌వివాహం చేసుకున్నారు వీరికి దివ్య‌,దేవాన్ష్ అనే క‌వ‌ల‌లు జ‌న్మించారు.

వెంక‌ట న‌ర్సింహులు ప్రైవేట్ డ్రైవ‌ర్ గా ప‌ని చేసేవాడు.సోమ‌వారం ప‌నికి వెళ్లి వ‌చ్చాకా భార్య,భ‌ర్త‌లిద్ద‌రూ గొడవ‌ప‌డ్డారు.దీంతో పుష్ప పిల్ల‌ల‌ను తీసుకొని చ‌నిపోతాన‌ని ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్ల‌గా గ్రామ‌స్తులు న‌చ్చ‌జెప్పి పంపారు.ఆ తరువాత ఆమె గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది అటుగా వెళ్తున్న వారు గమనించి బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తమ బిడ్డను అత్తింటి వారే ఆస్తి కోసం చంపారని పుష్ప బంధువులు ఆరోపిస్తూ గొడవకు దిగారు.మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ మన్సూరుద్దీన్‌, తహసీల్దార్‌ హరిప్రసాద్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.బంధువులు ససేమిరా అనడంతో మృతదేహాన్ని బలవంతంగా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటనరసింహులును పోలీసుస్టేషన్‌కు తరలించారు.