సింహాచలం ఆలయంలో చందన అరగదీత
విధాత(సింహాచలం): సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో నాలుగో రోజు సోమవారం 28 కిలోల చందనం అరగదీత కార్యక్రమం కొనసాగింది. ఆదివారం 27 కిలోల చందనం తొలి రోజు 17 కిలోలు, రెండో రోజు 26 కిలోలు తీశారు. ప్రతిరోజూ అరగదీసిన చందనాన్ని ఆలయ భాండాగారంలో అధికారులు భద్రపరుస్తున్నారు. ఈ నెల 14న వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని జరిగే చందనోత్సవం నాడు స్వామివారికి తొలివిడతగా చందనాన్ని సమర్పించనున్నారు.

విధాత(సింహాచలం): సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో నాలుగో రోజు సోమవారం 28 కిలోల చందనం అరగదీత కార్యక్రమం కొనసాగింది. ఆదివారం 27 కిలోల చందనం తొలి రోజు 17 కిలోలు, రెండో రోజు 26 కిలోలు తీశారు. ప్రతిరోజూ అరగదీసిన చందనాన్ని ఆలయ భాండాగారంలో అధికారులు భద్రపరుస్తున్నారు.
ఈ నెల 14న వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని జరిగే చందనోత్సవం నాడు స్వామివారికి తొలివిడతగా చందనాన్ని సమర్పించనున్నారు.