ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి..!

మేషం

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అవసరానికి ధనం అందుతుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఊహించని విజయాలు సాధిస్తారు. పిత్రార్జిత ఆస్తి కలిసి వస్తుంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. వృధా ఖర్చులు నివారించి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారం రంగాల వారు కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. ఉద్యోగులు చిత్తశుద్ధితో కష్టించి పనిచేస్తే విజయం మీదే. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ కోప స్వభావం కారణంగా సన్నిహితుల మధ్య అపార్థాలు, ఇరుగుపొరుగు వారితో గొడవలు రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అపార్థాలతో మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో సాధించిన ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పనిభారం పెరుగుతుంది. ఉద్యోగస్థులు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపార రంగాల వారు కీలక విషయాలలో ఆచి తూచి వ్యవహరించాలి. వ్యాపారంలో ఆర్థిక నష్టాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. సమాజంలో కీరి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ సహనమే మీకు శ్రీరామరక్ష.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వేసే ప్రతీ అడుగు, చేసే ప్రతిపనీ శుభ ఫలితాలనిస్తుంది. ఉద్యోగస్థులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేసి తిరుగులేని విజయాలను అందుకుంటారు. అయితే మితిమీరిన ఆత్మ విశ్వాసం కూడా మంచిది కాదు. ఆర్థికంగా శుభఫలితాలు ఉంటాయి. కుటుంబ కలహాలతో మనశ్శాంతి దెబ్బ తింటుంది.

తుల

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగత జీవితంలో అనేక శుభ ఫలితాలు ఉంటాయి. నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అన్ని రంగాల వారికి సౌభాగ్య సిద్ధి, లక్ష్మీ కటాక్షం ఉంటాయి. దైవబలంతో ఆర్థికంగా సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు.

వృశ్చికం

ఇన్ని రోజులుగా మీరు అనుభవించిన ఆవేదన తొలగిపోయే సమయం వచ్చింది. మీ బాధను అందరితో పంచుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మంచి సమయం గడపడటం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ విషయాలలో ఆత్మీయుల సలహా పాటించండి. అనవసర వివాదాల జోలికి పోవద్దు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

మకరం

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా వేధించిన అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేసి తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటారు. మీ దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేముందు కుటుంబ సభ్యులు సలహా తీసుకోండి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంపద పెరుగుతుంది. సృజనాత్మకంగా వ్యవహరించి కొత్తగా ఆలోచిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు తరచూ ఆటంకాలు ఎదురుకావచ్చు.