Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థికంగా శుభఫలితాలు
Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ ఉత్సాహంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృవర్గం నుంచి ఆర్ధికలబ్ధి ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలలో సన్నిహితుల సహాయంతో ఆర్ధికంగా లాభ పడవచ్చు. ఓ శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అంత ఆశాజనకంగా ఉండదు. అనేక రకాల సమస్యలు ఈ రోజు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్ధిక సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదాలతో అన్నింటా విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులు తమ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు చేటు చేస్తాయి. ఆర్ధికంగా సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు బదిలీ ఉండవచ్చు. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం. ఆర్ధిక లాభాలు సంతృప్తి కలిగిస్తాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం సహకరిస్తుంది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహంగా ముందుకుసాగితే సత్ఫలితాలు ఉంటాయి. నిరాశ, ప్రతికూల ఆలోచనలు విడిచి పెడితే మంచిది. మీ మాట తీరు కారణంగా శత్రువులు పెరుగుతారు. వివాదాలు, సమస్యలకు దూరంగా ఉంటే మంచిది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయం మీ వెన్నంటే ఉంటుంది. విశేషమైన ఆర్ధిక లాభాలు అందుకుంటారు. రుణభారం తగ్గుతుంది. దూరదృష్టితో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆస్తులు వృద్ధి చేస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచన మేరకు నడుచుకుంటే మంచిది. పిల్లల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదలతో పనిచేసి ఆటంకాలు అధిగమిస్తారు. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలకు ఆస్కారం ఉంది.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు సమర్ధవంతంగా అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి పెరగవచ్చు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యపై శ్రద్ధ పెట్టండి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. శత్రుబలం పెరుగుతోంది కాబట్టిప్రతి పనిలోనూ ఆచి తూచి నడుచుకోండి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోకపోతే శత్రువులు పెరుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవచ్చు. ఆర్ధిక సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి.