Horoscope | మే 8, గురువారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కల్యాణయోగం..!
Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమ పెరగవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మీరు వేసే ప్రతి అడుగు సత్ఫలితాలనిస్తుంది. ఆర్థిక సంబంధమైన సమావేశాలకు హాజరు కావచ్చు. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి. ఒక వ్యవహారంలో నిందలు పడాల్సి ఉంటుంది. సహనం కోల్పోరాదు. ఖర్చుల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. విశేషమైన ఆర్ధిక లాభాలు ఉంటాయి. కోరుకున్నవన్నీ దక్కుతాయి. కీలక సమావేశాలలో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తెలియని ఆందోళన, అనిశ్చితితో ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. ప్రియమైన వారితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం క్షీణించవచ్చు.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో అనుబంధం దృఢ పడుతుంది. స్నేహితుల నుంచి, సన్నిహితుల నుంచి ఆర్ధిక లబ్ది పొందుతారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు తెలివిగా చక్కదిద్దుతారు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు రావడానికి సమయం పట్టవచ్చు. ఓర్పు, సహనంతో ఉండడం అవసరం. నిరాశ చెందవద్దు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది.
కన్య
కన్యారాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. ఆటంకాలు, అవరోధాలు, ప్రతికూలతలు లేని మంచి రోజు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా, సంతోషంగా గడుపుతారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలం. ఆధ్యాత్మికతతో ప్రశాంతత పొందుతారు. ఖర్చులు పెరగవచ్చు.
తుల
తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ కోపం, పరుష పదాల కారణంగా కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు మౌనంగా ఉండండి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలోను ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఓ వ్యవహారంలో డబ్బు నష్టం జరుగుతుంది. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా శుభప్రదంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అద్భుతమైన రోజు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పనిని మీ ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది.
ధనుస్సు
ధనుస్సు రాశివారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సంతోషం కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. వివాహితుల వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆర్ధికంగా అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సరదాగా సాగుతుంది. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.
మకరం
మకరరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. పదోన్నతులు అందుకుంటారు. స్థానచలనం సూచన ఉంది. కుటుకబ సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వ్యాపారంలో ఊహించని ఆర్ధిక లబ్ది ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనైతిక పనులు, ఆలోచనకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో ఘర్షణలు ఏర్పడకుండా కోపాన్ని, మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రతికూల ఆలోచనలు, నిరాశావాదం వీడితే మంచిది. ఆర్ధికంగా గడ్డుకాలం. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కళాకారులు ఈ రోజు నూతన అవకాశాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలకు అనుకూలం. మీరు సాధించిన విజయం మీకు మంచి గుర్తింపు తీసుకు వస్తుంది. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.