నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వివాహం నిశ్చ‌య‌మ‌వుతుంది..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వివాహం నిశ్చ‌య‌మ‌వుతుంది..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. కొన్ని ఏళ్లుగా అనుభవిస్తున్న కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో, కీలక వ్యవహారాలలో దూకుడు నిర్ణయాలు చేటు తెస్తాయి. ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబంతో సరదాగా గడిపితే ఒత్తిడి దూరమవుతుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశముంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబసభ్యులతో, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. అనుకోకుండా సంపదలు కలిసి రావడంతో ఆనందంగా ఉంటారు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. వృథా ఖర్చులు పెరగవచ్చు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఈ రాశివారికి ఈ రోజు అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల కారణంగా అశాంతికి గురవుతారు. యోగా, ధ్యానం వంటివి చేయడం వలన ప్రశాంతత పొందుతారు. వైద్య చికిత్స నిమిత్తం అధిక ధనవ్యయం ఉండవచ్చు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా లేనందున చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గంతో విభేదాలు ఏర్పడే అవకాశముంది. కోపావేశాలు అదుపు చేసుకోండి. అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి. స్థిరాస్తి వ్యహారాలలో అప్రమత్తంగా ఉండాలి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారులు భాగస్వామ్య ప్రాజెక్టులకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో ఎదురయ్యే పోటీని ఒంటరిగానే సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ ప్రతిష్ట దెబ్బ తీసే పనులకు దూరంగా ఉంటే మంచిది.

తుల

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఇతరులు చెప్పిన మాటలు నమ్మి మోసపోయే ప్రమాదముంది. స్వబుద్ధితో అలోచించి వివేకంతో చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. నమ్మించి మోసం చేసే వారిపట్ల జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో పురోగతి, ఆర్థిక ప్రయోజనాలుంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టం వాటిల్లుతుంది. మీ మాటతీరుతో చిక్కుల్లో పడతారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదముంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. అనుకోకుండా సంపదలు కలిసివస్తాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఊహించని ధనలాభాలు అందుకుంటారు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి చేపట్టిన పనులు సులభంగా, సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు, వృత్తినిపుణులు ఊహించని విజయాన్ని అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఆర్థికంగా గొప్ప శుభఫలితాలను అందుకుంటారు.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనుకోని ఆపదలు ఎదురవుతాయి. మనోనిబ్బరంతో చేసే పనులు విజయాలను అందిస్తాయి. ఉద్యోగులు తీరికలేని పనితో ఒత్తిడికి గురవుతారు. వ్యాపారులు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి సరిపడా ఖర్చులుంటాయి.