Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఇవాళ తిరుగులేని రోజు..!

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఇవాళ తిరుగులేని రోజు..!

మేషం (Aries)

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు. కీలకమైన పనులలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తే ప్రయోజనం ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగంలో అధిక పనిఒత్తిడి, శారీరక శ్రమ ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి.

వృషభం (Taurus)

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మాటతీరు, కోపాన్ని నియంత్రించుకుంటే మంచిది. కుటుంబ వాతావరణం ఉద్రిక్తతతో ఉంటుంది. సహనం, శాంతం అలవరచుకుంటే మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

మిథునం (Gemini)

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి.

కర్కాటకం (Cancer)

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

సింహం (Leo)

సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అదృష్ట ఫలాలున్నాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శుభ ఫలితాలుంటాయి. ఆత్మ విశ్వాసంతో పనిచేసి ఓ కీలక సమస్యను పరిష్కరిస్తారు. ఉద్యోగులు తమ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. ధనలాభాలున్నాయి.

కన్య (Virgo)

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీవ్రమైన భావోద్వేగంతో సతమతమవుతారు. బలహీనతలు అధిగమిస్తే మంచిది. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించడం తెలివైన పని. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.

తుల (Libra)

తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. వ్యాపారంలో ఆటంకాలు, చికాకులు ఎక్కువ కావచ్చు. పట్టుదలతో పనిచేస్తే ఆటంకాలు దూరమవుతాయి. మిత్రులతో విహారయాత్రలకు వెళ్లారు. కుటుంబంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు.

వృశ్చికం (Scorpio)

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఇది ఒక తిరుగులేని రోజు! అద్భుతమైన యోగం కలగబోతోంది. బుద్ధిబలంతో అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు, వ్యాపారాల్లో విజయం వంటి శుభఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కోవడం కష్టతరంగా ఉంటుంది. వ్యాపారంలో పోటీ పెరగవచ్చు. పెద్దల ఆశీస్సులు, దైవబలంపై విశ్వాసం ఉంచితే మంచిది. ముందుచూపు లోపించడంతో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.

మకరం (Capricorn)

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ఇతరుల సలహాలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. యోగాతో ఒత్తిడిని దూరం చేయవచ్చు. అనుకోని ఖర్చులు ఉండవచ్చు.

కుంభం (Aquarius)

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చక్కని ప్రణాళికతో, ముందుచూపుతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అనవసర చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండండి.

మీనం (Pisces)

మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఏకాగ్రతతో పనిచేస్తే ఆశించిన ఫలితాలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జీవిత భాగస్వామితో అపార్ధాలు, గొడవలు ఏర్పడవచ్చు. విచారం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి.