సంతాన ప్రాప్తి క‌ల‌గాలంటే.. హ‌నుమంతుడిని ఇలా పూజించాలి..!

ప్ర‌తి మంగ‌ళ‌వారం హ‌నుమంతుడిని పూజిస్తే సంతాన ప్రాప్తి క‌లుగుతుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏడు వారాలు ఆంజ‌నేయుడిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తే సంతానం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని సూచిస్తున్నారు.

సంతాన ప్రాప్తి క‌ల‌గాలంటే.. హ‌నుమంతుడిని ఇలా పూజించాలి..!

పెళ్లైన దంప‌తులు సంతానం కోసం ఆరాట‌ప‌డుతుంటారు. కొంద‌రికి వెంట‌నే సంతానం క‌లుగుతుంది. ఇంకొంద‌రికి పెళ్లై ఏండ్లు గ‌డుస్తున్నా సంతానం క‌ల‌గ‌దు. ఇలాంటి వారు మొక్క‌ని దేవుడు ఉండ‌డు. తిర‌గ‌ని హాస్పిట‌ల్ ఉండ‌దు. ఎన్ని మొక్కులు మొక్కినా.. ఎన్ని హాస్పిట‌ల్స్ తిరిగినా ఫ‌లితం ఉండ‌దు. అయితే ప్ర‌తి మంగ‌ళ‌వారం హ‌నుమంతుడిని పూజిస్తే సంతాన ప్రాప్తి క‌లుగుతుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏడు వారాలు ఆంజ‌నేయుడిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తే సంతానం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని సూచిస్తున్నారు.

మంగళవారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తలంటు స్నానం చేసి ఎర్రని దుస్తులు ధరించి ఆంజనేయ స్వామిని పూజించాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఐదు లేదా ఏడు వారాలు హ‌నుమంతుడిని పూజించి, ఉపవాసం ఉన్నవారికి సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మంగళవారం స్వామివారికి పూజ చేసేవారు ఎరుపు దుస్తులను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో, సింధూరంతో స్వామికి పూజలు చేసి కేసరి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుంది.

ఇలా ప్రతి మంగళవారం సంతానంలేని దంపతులు ఈ ఈ విధంగా పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలగడమేకాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, స్వామివారికి పూజ చేసే సమయంలో తమలపాకుతో అభిషేకం చేయటం వల్ల సుఖశాంతులు కలుగుతాయి. పూజ అనంతరం హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా తొందరగా పరిష్కారమవుతాయి. అయితే మంగళవారం స్వామివారికి పూజ చేసే వారు ఉపవాసంతో పూజ చేసి రాత్రికి ఉప్పులేని అన్నం తినడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.