Spiritual | ‘శ‌ని’ వెంటాడుతుందా..? శ‌నివారం ఈ ప‌రిహారాలు చేయండి మ‌రి..!

Spiritual | హిందూ సంప్ర‌దాయం( Hindu Custom ) ప్ర‌కారం శ‌నివారం( Saturday ) ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. శ‌నివారాన్ని శ‌నిదేవుని( Shani Devudu ) ఆరాధ‌న‌కు ప్ర‌ధాన‌మైన‌దిగా భ‌క్తులు( Devotees ) భావిస్తారు. ఈ రోజున క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన వేంక‌టేశ్వ‌ర స్వామి( Lord Venkateshwara )ని, ఆంజ‌నేయ స్వామి( Lord Hanuman )ని కూడా ఆరాధిస్తారు.

Spiritual | ‘శ‌ని’ వెంటాడుతుందా..? శ‌నివారం ఈ ప‌రిహారాలు చేయండి మ‌రి..!

Spiritual | హిందూ సంప్ర‌దాయం( Hindu Custom ) ప్ర‌కారం శ‌నివారం( Saturday ) ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. శ‌నివారాన్ని శ‌నిదేవుని( Shani Devudu ) ఆరాధ‌న‌కు ప్ర‌ధాన‌మైన‌దిగా భ‌క్తులు( Devotees ) భావిస్తారు. ఈ రోజున క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన వేంక‌టేశ్వ‌ర స్వామి( Lord Venkateshwara )ని, ఆంజ‌నేయ స్వామి( Lord Hanuman )ని కూడా ఆరాధిస్తారు. అయితే కొంద‌ర్నీ శ‌ని వెంటాడుతుంది. అంటే గ్రహాల గమనం వలన ఏలినాటి శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు మనం అనుకున్న పనులు ఆలస్యం కావడం కానీ, ఆరోగ్య సమస్యలు ఏర్పడడం గాని జరుగుతుంటాయి. ఈ స‌మ‌స్య‌లు మ‌న జీవితాన్ని ప్ర‌భావితం చేస్తాయి. కాబ‌ట్టి శ‌ని బాధ‌లు పోగొట్టుకుని స‌క‌ల శుభాలు పొందాలంటే.. శ‌నివారం శ‌ని దేవుడికి ప‌రిహారాలు చేయాలి. మ‌రి ఆ ప‌రిహారాలు ఏంటో తెలుసుకుందాం..

శని దోషాలకు పరిహారాలు ఇవే..

ఏలినాటి శని, అర్దాష్టమ శని, అష్టమ శని ప్రభావం వలన కలిగే చెడు ఫలితాలను తగ్గించడానికి శనివారం కొన్ని విశేషమైన కార్యక్రమాలను చేయాలని శాస్త్రం చెబుతోంది.

  • శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించి నవగ్రహాలున్న ఆలయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే మంచిది.
  • శనీశ్వరుని వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు.
  • నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహానికి పొందవచ్చు.
  • శనివారం వేంకటేశ్వరుని పూజిస్తే శని దేవుని అనుగ్రహం ఉంటుంది. ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి వేంకటేశ్వరుని ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే మొక్కులు నెరవేరుతాయి.
  • హిందూ పురాణాల ప్రకారం శనివారం ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి శని బాధలు ఉండవని అంటారు.
  • శనివారం ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణాలు చేయాలి. వీలుంటే హనుమంతునికి శనివారం వడమాల సమర్పిస్తే శని బాధలు తొలగిపోతాయని నమ్మకం.
  • శనివారం ఆంజనేయునికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలు అయినా పోతాయి.
  • శనివారం పరమేశ్వరునికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. ఒక నియమం ప్రకారం అయిదు శనివారాలు కానీ తొమ్మిది శనివారాలు కానీ శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం.
  • శనివారం శివాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద దీపం పెట్టి, రావి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయని గురువులు చెబుతారు.
  • శనివారం నాడు ఇనుము వస్తువులు, నల్ల నువ్వులు, నూనె, ఉప్పు వంటి పదార్ధాలు కొనరాదని పెద్దలు చెబుతారు.
  • శనివారం ఈ నియమాలు పాటించడం వలన ఏలినాటి శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని శాస్త్రవచనం. శుభం భూయాత్!