Debts Recovery Tips | మొండి బాకీలు వసూలు కావాలంటే.. గురువారం సాయంత్రం ఇలా చేయండి..!
Debts Recovery Tips | ధనవంతులు ఇతరులకు అప్పులు( Debts ) ఇస్తుంటారు. కొన్నిసార్లు ఆ అప్పులను వసూలు చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో వసూలు చేయలేరు. అవి మొండి బాకీల కింద పడిపోతాయి. మరి మొండి బాకీలు వసూళ్లు కావాలంటే ఆధ్యాత్మిక( Spiritual ) పరంగా కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Debts Recovery Tips | తమ కుటుంబ పోషణ కోసమో, బిజినెస్( Business ) కోసమో.. ధనవంతుల వద్ద అప్పులు( Debts ) తీసుకుంటారు. రాసుకున్న ఒప్పంద పత్రం( Agreement ) ప్రకారం తిరిగి అప్పులు చెల్లిస్తుంటారు. కానీ కొందరు అప్పులు తిరిగి చెల్లించడంలో బాగా ఇబ్బంది పెడుతుంటారు. అప్పుడు ఇస్తా.. ఇప్పుడు ఇస్తా.. అని కాలయాపన చేస్తుంటారు. అలాంటి వారి వద్ద మొండి బకాయిలు వసూలు చేయడం చాలా కష్టమవుతుంది. మరి అలాంటి మొండి బాకీలు వసూలు కావాలంటే.. గురువారం( Thursday ) నాడు కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం..
మొండి బాకీల వసూలుకు పాటించాల్సిన నియమాలు..
1. గురువారం రోజు సూర్యాస్తయానికి( Sunset ) ఒక గంట ముందు.. రావి, మర్రి, వేప చెట్లలో ఏదో ఒక వృక్షం వద్దకు వెళ్లండి. చీమలు( Ants ) ఎక్కువగా సంచరించే ప్రాంతంలో ఒక కిలో చక్కెర పోయండి. ఇలా మూడు గురువారాలు చేస్తే మొండి బాకీలు వసూలు అవుతాయి.. రావాల్సిన ధనం( Money ) చేతికి అందుతుందట.
2. ఇక గురువారం నాడు.. ఏ సమయంలోనైనా సమీపంలో ఉన్న వేంకటేశ్వర స్వామి( Venkateshwara Swamy ) ఆలయానికి వెళ్లండి. రకరకాల పూలతో కూడిన పూలదండ( Flowers )ను స్వామి వారికి అలంకరించండి. ఇలా మూడు గురువారాలు చేయడంతో అప్పులు వసూలు అవుతాయట.
3. మొండి బాకీలు వసూలు కావాలంటే దేవాలయ ప్రాంగణంలో దానిమ్మ మొక్క నాటి నీళ్లు పోస్తే లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం లభిస్తుందని.. రావాల్సిన డబ్బులు చేతికొస్తుందని పండితులు సూచిస్తున్నారు.
4. జమ్మి చెట్టు( Jammi Chettu )కు ప్రదక్షిణలు చేసినా మొండి బకాయిల సమస్యలు తొలగిపోతయాట. 41 రోజుల పాటు ప్రతిరోజూ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి 12 ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు.
5. శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్లి పెరుగులో మినుములు వేసి ఆ పెరుగును రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఎవరైతే శనివారం ఇలా చేస్తారో వాళ్లకు రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయట.