ఆరు రోజులు దర్శనాలకు బ్రేక్
సింహాచలం: వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు భక్తులకు దర్శనాలుండవు. అర్చకుల విజ్ఞప్తి మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో ఆలయాన్ని (భక్తులకు) మూసివేయాలని ఈఓ సూర్యకళగారు నిర్ణయించారు. ఏడాదిలోనే అతిపెద్ద ఉత్సవం.. చందనోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నారు. లక్ష మందికిపైగా తరలివచ్చే ఉత్సవమే అయినా ప్రజల ఆరోగ్యం దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు అనుమతిలేకపోయినా.. స్వామివారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలు ఉదయం ఆరాధన నుంచి రాత్రి పవళింపు సేవ వరకు […]

సింహాచలం: వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు భక్తులకు దర్శనాలుండవు. అర్చకుల విజ్ఞప్తి మేరకు, ధర్మకర్తల మండలి ఆమోదంతో ఆలయాన్ని (భక్తులకు) మూసివేయాలని ఈఓ సూర్యకళగారు నిర్ణయించారు.
ఏడాదిలోనే అతిపెద్ద ఉత్సవం.. చందనోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నారు. లక్ష మందికిపైగా తరలివచ్చే ఉత్సవమే అయినా ప్రజల ఆరోగ్యం దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు అనుమతిలేకపోయినా.. స్వామివారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలు ఉదయం ఆరాధన నుంచి రాత్రి పవళింపు సేవ వరకు యధావిధిగానే నిర్వహిస్తారు.
స్వామివారి సేవలకు ఎలాంటి లోటు ఉండదు. 10-05-21 నుంచి 15-05-21 వరకు భక్తులెవరూ సింహాచలం కొండపైకి రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఇందుకు భక్తులు సహకరించాలని ఈఓ సూర్యకళ కోరారు.