Astrology | రేపు ధనుస్సు రాశిలోకి శుక్రుడు.. ఇక ఆ మూడు రాశుల వారికి అఖండ ధనయోగమే..!
Astrology | వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాలు తమ గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా ఆ ప్రభావం కొన్ని రాశులపై తప్పక ఉంటుంది. ఈ గ్రహాల గమనం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను ఇవ్వొచ్చు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను కలిగించే ఆస్కారం ఉంటుంది.

Astrology | వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాలు తమ గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా ఆ ప్రభావం కొన్ని రాశులపై తప్పక ఉంటుంది. ఈ గ్రహాల గమనం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను ఇవ్వొచ్చు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను కలిగించే ఆస్కారం ఉంటుంది.
అయితే విలాసాలకు, సుఖసంతోషాలకు అధిపతి అయిన శుక్రుడు( Venus ) ఈ నెల 7వ తేదీన ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారనున్నారు. ప్రస్తుతం వృశ్చిక రాశి(Scorpio) లో ఉన్న శుక్రుడు( Venus ).. గురువారం నాడు ధనుస్సు రాశి(Sagittarius)లోకి ప్రవేశించనున్నారు. ధనుస్సు రాశిలో శుక్రుడు సంచారం కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రావడంతో పాటు అఖండ ధనయోగం లభించనుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.
మేష రాశి(Aries)
శుక్రుడు( Venus ) ధనుస్సు(Sagittarius)లో సంచారం కారణంగా ప్రధానంగా మేష రాశి( Aries ) జాతకులకు అదృష్టం వరిస్తుంది. ఈ సమయంలో మేష రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. శారీరక మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా ఈ సమయంలో వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ( Lakshmi Puja ) చేయడం మంచిది.
కన్య రాశి (Virgo)
ధనుస్సు రాశిలో శుక్ర సంచారం కారణంగా కన్య రాశి జాతకులు కూడా అదృష్టవంతులు అవుతారు. ఈ శుక్ర సంచారం కన్య రాశి( Virgo ) వారి జీవితంలో గణనీయమైన మార్పులను తెస్తుంది. ఆర్థికంగా కన్యా రాశి వారు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు తమ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రతి శుక్రవారం అష్టలక్ష్మి స్తోత్రం పారాయణ చేస్తే సత్ఫలితాలు ఉంటాయి.
కుంభ రాశి (Aquarius)
ధనుస్సులో శుక్ర సంచారం కారణంగా లాభపడే మరో రాశి కుంభ రాశి( Aquarius ). కుంభ రాశి వారికి ఈ శుక్ర సంచారం అత్యంత శుభాలను ఇస్తుంది. శుక్ర సంచారం కారణంగా కుంభ రాశి జాతకులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. గతంలో నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రభుత్వపరంగా రావలసిన డబ్బు, ఇతర మొండి బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధన లాభాలకు కూడా ఆస్కారముంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.