Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు భూములు కొనుగోలు చేసే అవ‌కాశం..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. త‌మ‌ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన, వార‌ ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు భూములు కొనుగోలు చేసే అవ‌కాశం..!

మేషం

మేష రాశివారికి ఈ వారం మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నిల‌దొక్కుకుంటారు. ప‌నిలో నిబ‌ద్ధ‌త‌, మంచి ఆలోచ‌న‌ల‌తో ముందుకు వెళ్ల‌డం అవ‌స‌రం. ఈ వారాంతంలో స్నేహితుల‌తో గొడ‌వ‌లు ఏర్ప‌డి విభేదాలు రావొచ్చు. వ్యాపారుల‌కు మిశ్ర‌మ ఫ‌లితాలు ఉన్నాయి. దూర ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది. న్యాయ‌వాద‌, వైద్య వృత్తుల్లో ఉన్న వారికి ఈ వారం క‌లిసి వ‌స్తుంది. వారాంతంలో ఒక స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

వృషభం
ఈ రాశివారికి సానుకూల ఫ‌లితాలు మెండుగా ఉన్నాయి. కుటుంబంలో సుఖ‌సంతోషాలు వెల్లివిరియ‌నున్నాయి. స‌మాజంలో ఉన్నత‌స్థాయిలో ఉండే వ్య‌క్తుల‌తో ఏర్ప‌డే ప‌రిచ‌యాలు.. భ‌విష్య‌త్‌కు బంగారు బాట‌లు వేస్తాయి. ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌డంతో పాటు అనుకున్న ప‌నుల‌న్నీ సాఫీగా సాగిపోతాయి. అప్పుల నుంచి విముక్తి క‌లుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొటారు. పోటీ ప‌రీక్ష‌ల్లో విద్యార్థులు విజ‌యాలు సాధిస్తారు.

మిథునం

మిథున రాశివారికి ఈవారం అనుకూలంగా ఉంది. అనుకున్న స్థాయిలో పనులు పూర్తవుతాయి. స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆప‌ద స‌మ‌యంలో పెద్ద‌లు ఆదుకుంటారు. కుటుంబసభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా మిశ్రమ వాతావరణం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పాతబాకీలు నిదానంగా వసూలు అవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.

కర్కాటకం

క‌ర్కాట‌క రాశి వారికి ఈ వారంలో ప్రారంభించిన ప‌నులు స‌కాలంలో పూర్త‌వుతాయి. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంతో హుషారుగా ఉంటారు. స‌మాజంలో ఉన్న ప‌లుకుబ‌డి కార‌ణంగా చేసే ప‌నుల‌న్నీ నెర‌వేరుతాయి. వివిధ మార్గాల్లో రాబ‌డి పెరుగుతుంది. తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. వారాంతంలో శుభ‌వార్తలు వింటారు. ఆహారం విష‌యంలో క‌చ్చితంగా స‌మ‌య‌పాల‌న పాటించాలి. లేక‌పోతే ఆరోగ్య స‌మ‌స్య‌లు సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది. నిర్మాణ రంగంలో ఉన్నవారికి సమస్యలు ఉండొచ్చు.

సింహం
ఈ రాశివారికి ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శ్రమ అధికం అయినప్పటికీ చేపట్టిన పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సంయమనంతో వ్యవహరించండి. ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతి అవకాశాలు ఉన్నాయి.

కన్య

క‌న్య రాశివారు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ రాశివారు నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు.

తుల

ఈ రాశివారికి ఆదాయం అమాంతం పెరుగుతుంది. పాత‌బాకీలు వ‌సూలు అవుతాయి. ప‌నులు కొంత ఆల‌స్యంగా పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. చివ‌ర‌కు క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం మాత్రం ఉంటుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణకు చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది.

వృశ్చికం

ఈ రాశివారికి ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. చేప‌ట్టిన ప‌నులు స‌కాలంలో పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. ఓపిక చాలా అవ‌స‌రం. నూత‌న గృహ నిర్మాణానికి సంక‌ల్పిస్తారు. స‌మ‌యానుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తే బెట‌ర్. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. తోటివారితో అభిప్రాయభేదాలు రావచ్చు. ఆత్మీయుల స‌హ‌కారంతో చేప‌ట్టిన‌ పనులు నెరవేరుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు

ధ‌నుస్సు రాశివారికి ఉద్యోగ ప్ర‌య‌త్నాలు క‌లిసి వ‌స్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. పదోన్నతి కారణంగా స్థానచలనం ఉంటుంది. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. ఖర్చులు పెరగవచ్చు. భూమి కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.

మకరం

మ‌క‌ర రాశివారికి పెండింగ్‌లో ఉన్న డ‌బ్బు చేతికి అందుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. స‌మాజంలో పెద్ద‌ల స‌హ‌కారం ల‌భిస్తుంది. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు రావచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ, రాజకీయ పనుల్లో జాప్యం జరుగుతుంది.

కుంభం
ఈ రాశివారికి ఉన్న‌ట్టుండి భ‌క్తిభావం పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. తొందరపాటు నిర్ణయాలతో పనులలో జాప్యం ఉండవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.

మీనం
మీన రాశివారు కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.