Salary Hike For Bhu Bharati FT Staff | భూభారతి ఎఫ్ టీఎస్ లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ భూభారతి ఎఫ్ టీఎస్ లకు సీఎం రేవంత్ రెడ్డి జీతాల పెంపు గుడ్ న్యూస్; 708 ఉద్యోగుల టీజీటీఎస్ కాంట్రాక్ట్ గుర్తింపు.

telangana-government-recognizes-bhu-bharati-fts-as-contract-employees-and-hikes-salaries

విధాత, హైదరాబాద్ : తెలంగాణ భూ భారతి స్కీమ్ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దసరా కానుకగా గుడ్ న్యూస్ అందించింది. భూభారతి 708 ఎఫ్ టీఎస్ లను టీజీటీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తిస్తూ, జీతాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. టెరాసిస్ అనే ప్రైవేట్ సంస్థ తరుపున ధరణి ఆపరేటర్లుగా ఉన్న భూభారతి ఎఫ్ టీఎస్ లను టీజీటీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తిస్తూ..వారి వేతనాన్ని రూ.12000 నుంచి రూ.28,148లకు పెంచుతూ ప్రజా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయం పట్ల ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కొనగాల మహేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ఎఫ్ టీఎస్ ల జీవితాలలో మరువలేనిది అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఎఫ్ టీఎస్ లకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం పట్ల మా కుటుంబాలు సర్వదా రుణపడి ఉంటాయన్నారు. ఎఫ్ టీఎస్ ల చిరకాల కోరిక నెరవేర్చిన ప్రజా ప్రభుత్వానికి సీసీఎల్ఏ అధికారులు లోకేష్ కుమార్, మకరందం, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డిలకు భూ భారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలుపుతుందని పేర్కొన్నారు.