Bhumika | 47 ఏళ్ల వయసులోనూ అదే అందం.. భూమిక ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

Bhumika | ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన భూమిక‌ ఇప్పటికీ అదే అందం, ఫిట్‌నెస్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ‘ఖుషీ’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’, ‘మిస్సమ్మ’, ‘వాసు’ వంటి వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భూమిక.. ఇటీవల తన ఆరోగ్య రహస్యాలు, జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

  • By: Sandeep |    movies |    Published on : May 08, 2026 3:05 PM IST
Bhumika | 47 ఏళ్ల వయసులోనూ అదే అందం.. భూమిక ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!

Bhumika | ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన భూమిక‌ ఇప్పటికీ అదే అందం, ఫిట్‌నెస్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ‘ఖుషీ’, ‘ఒక్కడు’, ‘సింహాద్రి’, ‘మిస్సమ్మ’, ‘వాసు’ వంటి వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న భూమిక.. ఇటీవల తన ఆరోగ్య రహస్యాలు, జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

2000లో విడుదలైన ‘యువకుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భూమిక, తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ఖుషీ సినిమాతో ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. అనంతరం ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మిస్సమ్మ’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం కూడా అందుకున్నారు.

త‌న అందం వెన‌క ర‌హ‌స్యం ఇదే..

పెళ్లి తర్వాత సినిమాలకు కొంత దూరంగా ఉన్న భూమిక.. ఇటీవల మళ్లీ తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘యుఫోరియా’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అందం వెనుకున్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు.

తాను పూర్తిగా శాఖాహార ఆహారాన్నే తీసుకుంటానని భూమిక తెలిపారు. ఇంట్లో తయారుచేసిన సాధారణ ఆహారమే తనకు ఇష్టమని, ఎక్కువ మసాలాలు ఉన్న వంటకాలను దూరంగా పెడతానని చెప్పారు. ఖరీదైన డైట్ ప్లాన్‌లు, కఠినమైన ఆహార నియమాలు ఏవీ పాటించనని, కానీ ఏది తిన్నా మితంగా తీసుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ పెడతానని వెల్లడించారు.

యోగా త‌ప్ప‌నిస‌రి..

వ్యాయామం, యోగా తన జీవితంలో ముఖ్య భాగమని భూమిక చెప్పారు. మానసిక ప్రశాంతత కోసం యోగా చేస్తానని, ప్రతిరోజూ నడక తప్పనిసరిగా చేస్తానని తెలిపారు. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఈత కూడా సహాయపడుతుందని చెప్పారు. తన చర్మం ఇప్పటికీ కాంతివంతంగా కనిపించడానికి ప్రధాన కారణం సరైన జీవనశైలేనని వెల్లడించారు.

అంతేకాకుండా ఎక్కువగా నీరు తాగడం, తాజా పండ్లు తీసుకోవడం, సరైన నిద్ర తీసుకోవడం చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ఆమె వివరించారు. రాత్రి 10:30 లేదా 10:45 గంటలలోపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తానని, సరైన విశ్రాంతి లేకపోతే చిరాకు పెరుగుతుందని అన్నారు. పుస్తకాలు చదవడం, ప్రయాణాలు చేయడం తనకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని భూమిక తెలిపారు. ఒత్తిడిని దూరంగా ఉంచుకోవడమే ఆరోగ్యానికి అసలు రహస్యమని ఆమె అభిప్రాయపడ్డారు.

హీరోయిన్‌గా అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్న భూమిక, కొంత విరామం తర్వాత సహాయ పాత్రలతో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. MCA సినిమాలో వదిన పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అలాగే Sita Ramam, ‘బటర్ ఫ్లై’ వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో మెప్పించారు. ఇటీవల ‘యుఫోరియా’ చిత్రంలో తల్లి పాత్రలో భావోద్వేగభరిత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భూమిక.. ఇకపై మంచి కథలు వస్తే మరిన్ని తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.